- Advertisement -
కుటుంబ సర్వేలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్
మెదక్ లో కుటుంబ సర్వే కు శ్రీకారం
వాయిస్ టుడే
కుటుంబ సర్వేలో మున్నూరు కాపులు అందరూ భాగస్వాములు కావాలని మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ పిలుపు నిచ్చారు. మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో చెప్పిన కుటుంబ సర్వేకు మెదక్ లో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పట్టణంలోని పిట్లంబెస్ లోని మున్నూరు కాపు సంఘ భవనంలో జరిగిన కార్యక్రమంలో కొత్త లక్ష్మణ్ పటేల్ మాట్లాడుతూ మున్నూరు కాపుల చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో మున్నూరు కాపుల సంఖ్య గణనీయంగా ఉన్నప్పటికీ నిర్దిష్టమైన గణాంకాలు లేవన్నారు. ఈ నేపథ్యంలో గ్రామాలు, మండలాలు, వార్డులు, మున్సిపాలిటీలు, జిల్లాల వారీగా మున్నూరు కాపు కుటుంబాలు, జనాభా ఎంత ఉందనేది గుర్తించేందుకు తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం ఆధ్యర్యంలో కుటుంబ సర్వేకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. సమాజ అభివృద్ధి దిశగా కీలకమైన అడుగుగా చేపట్టిన ఈ సర్వే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. మున్నూరు కాపు జనాభా ఎక్కువగా ఉన్న కరీంనగర్, సూర్యాపేట జిల్లాలో ఇటీవల సర్వే ప్రారంభించగా మూడవదిగా మెదక్ జిల్లాలో మొదలు పెట్టినట్టు చెప్పారు. ప్రతి మున్నూరు కాపు కుటుంబ వివరాల సేకరణ, విద్య, ఉపాధి, ఆర్థిక స్థితిగతుల విశ్లేషణ, సమాజ సమస్యలపై సమగ్ర నివేదిక తయారీ, ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేత ఈ సర్వే ముఖ్య ఉద్దేశ్యమని వివరించారు. ఈ సర్వే కోసం ప్రత్యేక యాప్ రూపొందించడం జరిగిందని తెలిపారు. మెదక్ జిల్లాలోని మున్నూరు కాపు కుటుంబ సభ్యులు అందరూ ఈ సర్వేలో పాల్గొని, నిర్ణిత వివరాలు పొందుపర్చాలని, సర్వేను విజయవంతం చేసి, సమాజ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఇంఛార్జి నీలం నర్సింలు పటేల్. అపెక్స్ కమిటీ సభ్యులు మామిండ్ల అంజయ్య పటేల్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేమె యాదగిరి పటేల్, రాష్ట్ర నాయకులు వెంకన్న పటేల్, జర్నలిస్టు ఫోరం జిల్లా అధ్యక్షుడు తిమ్మన్న గారి శ్రీధర్, గౌరవ అధ్యక్షుడు కామాటి కృష్ణ పటేల్, నాయిని శేఖర్ పటేల్, బండ నరేష్ పటేల్, మున్నూరు కాపు సంఘం పట్టణ అధ్యక్షుడు కొంగటి గట్టేష్ పటేల్, కార్యదర్శి బెండల అశోక్ పటేల్, కోశాధికారి నాయిని ప్రసాద్ పటేల్, జిల్లా రైతు విభాగ అధ్యక్షుడు పెండల నాగభూషణం పటేల్, ఆయా శాఖల అధ్యక్షులు కాస యాదగిరి పటేల్, నింగమైల మల్లేశం పటేల్, మాజీ అధ్యక్షుడు ఆకుల భిక్షపతి పటేల్, బెండల స్వామి పటేల్, నల్లాల విజయ్ పటేల్, మాజీ కౌన్సిలర్ ఆవారి శేఖర్ పటేల్, సంగాయిపేట నర్సింలు పటేల్, కొంగటి మల్లేశం, అల్లం మధు పటేల్, పటేల్, కిష్టంగారి శివకుమార్ పటేల్, కాస కృష్ణ పటేల్,బెండల మల్లేశం పటేల్ , బోనగిరి వినోద్ పటేల్, ఆది వంశీ పటేల్, అవారి రమేష్ పటేల్, మాడిశెట్టి రాజు పటేల్, అనాసారం శ్రీనివాస్ పటేల్, నాగరాజు పటేల్, నియోజకవర్గ కోఆర్డినేటర్ వీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..
ఇందులో కుటుంబ సభ్యుల వివరాలు తప్పినిసరిగా నమోదు చేసుకోగలరు
Website :
https://munnurukapukutumbasurvey.com/
Website :
https://munnurukapukutumbasurvey.com/
- Advertisement -



