మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు….
కమాన్ పూర్: కాంగ్రెస్ పార్టీ గెలుపు నకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంథని ఎమ్మెల్యే దుద్దెల శ్రీధర్ బాబు అన్నారు. ఈ మేరకు రామగిరి మండలంలోని పన్నూరు టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు కట్కం సతీష్ శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంథని నియోజకవర్గం లో అధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని బి.ఆర్.ఎస్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పన్నూరు ఎంపీటీసీ మహేష్ రామగిరి మండల ప్రచార కమిటీ కన్వీనర్ ముత్యాల శ్రీనివాస్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎల్లె రామ్మూర్తి గ్రామ శాఖ అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్ రామగిరి సోషల్ మీడియా కన్వీనర్ సిద్ధమురళీకృష్ణ వకీల్ పల్లి కొమురయ్య తో పాటు పలువురు పాల్గొన్నారు.