బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి
Everyone should work to eradicate child marriage
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్
బాల్య వివాహ్ ముక్త్ భారత్ అవగాహన ముగింపు కార్యక్రమం మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహ నిర్మూలన అధికారులతో బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్యవివాహాలు చేస్తే కుటుంబ సభ్యులపై, వివాహాలు జరిపించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఈ సంవత్సరం అధికారులు నిలిపివేసిన 15 బాల్య వివాహాలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిపించినా, ప్రోత్సహించినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాల్య వివాహ నిర్మూలన అధికారులుగా ఉన్న ఆర్డీవోలు, ఎమ్మార్వోలు, పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలో బాల్య వివాహాలు జరగకుండా చూడాలని ఆదేశించారు. ‘బాల్య వివాహ రహిత భారతదేశం, కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం హర్షణీయమన్నారు. బాలల హక్కులు కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు ఉపాధ్యాయులు, అంగన్ వాడీలు,ఆశా వర్కర్లు, ప్రజలు భాగస్వామ్యం కావాలని సూచించారు బాల్ వివాహ్ ముక్త్ భారత్’ కోసం క్షేత్ర స్థాయిలో ప్రచారం చాలా ముఖ్యమన్నారు. స్వచ్చంథ సంస్థలు, అధికార యంత్రాంగం కలసి పని చేస్తే బాల్య వివాహాలు పూర్తిగా నిర్మూలించవచ్చని తెలిపారు. చైతన్యంతోనే ఈ బాల్య వివాహాల నిర్మూలన సాధ్యమన్నారు. బాల్య వివాహాల విషయంలో బాలికలు బలి అవుతున్నారని అభిప్రాయపడ్డారు.బాల్య వివాహాల నిర్మూలనకు ఇదివరకే ఉన్న విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ విసిపిసి,లను బలోపేతం చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. వివిధ కమ్యూనిటీల పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. బాల్య వివాహాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ చట్ట ప్రకారం తీసుకునే చర్యలను గురించిన సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా సంక్షేమ అధికారి సబితా, డిసిపిఓ పర్వీన్, సి డబ్ల్యూ సి చైర్ పర్సన్ ధనలక్ష్మి, ఆర్డీవోలు ఎమ్మార్వోలు పాల్గొన్నారు.