Sunday, September 8, 2024

దేశ సమగ్రత, ఐక్యతను పెంపొందించు టకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి …..జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

- Advertisement -
Everyone should work together to promote the integrity and unity of the country …. District Collector Muzammil Khan

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ అక్టోబర్ 31(వాయిస్ టుడే)
దేశ సమగ్రత, ఐక్యతను పెంపొందించుటకు ప్రతి ఒక్కరు పాటుపడాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.

మంగళవారం జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ తో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని భారత ప్రథమ హోమ్ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన అక్టోబర్ 31న ప్రతి ఏటా నిర్వహించు కుంటున్నామని తెలిపారు.

దేశ ప్రజలలో మనమంతా భారతీయుల మనే భావనను సుస్థిరం చేసిన మహనీయుడు అని, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు సంకల్పాన్ని భావి తరాలు ఆదర్శంగా తీసుకొని వారి ఆశయ సాధన దిశగా కృషి చేసి దేశ సమగ్రత, ఐక్యతను పెంపొందించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

మన జిల్లాలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేస్తూ పరిపాలనలో అనేక విజయాలు సాధించామని, అదే స్ఫూర్తితో భవిష్యత్తులో సైతం విజయాలు సాధించాలని అన్నారు.

అనంతరం దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడటానికి స్వయంగా అంకితమవుతామని, దేశ అంతర్గత భద్రతను పటిష్ట పరచటానికి స్వీయ తోడ్పాటు నందిస్తానని జిల్లా కలెక్టర్ ఉద్యోగులచే ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏ.ఓ. శ్రీనివాస్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్