Monday, March 24, 2025

అన్నీ తానై…అంతా తానై.. గెలుపులో బండి మార్క్

- Advertisement -

అన్నీ తానై…అంతా తానై..
గెలుపులో బండి మార్క్
కరీంనగర్, మార్చి 11, ( వాయిస్ టుడే )

Everything is on its own...everything is on its own.. Bandi Mark in victory

రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు వచ్చాయి. అవి అందరూ ఓట్లేసే ఎన్నికలు కావు. చదువుకున్న వారు అదీ డిగ్రీ ఆపైన చదువుకున్న టీచర్లు, గ్రాడ్యూయేట్లు మాత్రమే ఓట్లేసే ఎన్నికలు. వారిని కన్వీన్స్ చేసి ఓట్లు వేయించుకోవడం అంత ఈజీ కాదు. అయినా బీజేపీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించి రంగంలోకి దిగింది. ప్రకటించిన అభ్యర్థులు కొత్తవారు. నాలుగు జిల్లాల్లో ఉన్న ఆ పార్టీ క్యాడర్‌కి కూడా సుపరిచిత నేతలేం కాదు. అయినా ఆ ఇద్దరు విజయం సాధించారు. ఇప్పుడా విక్టరీపై విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. ఆ విక్టరీ వెనక ఎవరున్నారు..? గెలుపుకు ఏయే అంశాలు దోహదపడ్డాయి..?ఉత్తర తెలంగాణలో కమలం వికసించింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామబాద్, మెదక్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను కైవసం చేసుకుని బీజేపీ తన సత్తా చాటింది. అటు టీచర్ల ఎమ్మెల్సీ ఇటు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానాలను తన ఖాతాలో వేసుకుని దూకుడు ప్రదర్శిస్తోంది. రెండు సీట్లను గెలుచుకోవడం కోసం పక్కా స్కెచ్‌తో రంగంలోకి దిగి ప్రత్యర్థులను మట్టి కరిపించారు కమలనాథులు.. అందరికంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ.. పట్టభద్రుల స్థానానికి సంగారెడ్డి జిల్లాకు చెందిన చిన్నమైల్ అంజిరెడ్డిని.. ఉపాధ్యాయ నియోజకవర్గానికి ప్రైవేట్ విద్యాసంస్థల అధినేత మల్క కొమురయ్యలను ఖరారు చేసింది.ఆ ఇద్దరు అభ్యర్ధులు కూడా అటు పార్టీలో పెద్ద పేరున్న నేతలేం కాదు. ఇటు ప్రజల్లో పలుకుబడి కూడా అంతంత మాత్రమే. అయితే క్యాండేట్‌లను ప్రకటించడమే ఆలస్యం క్యాంపేయినింగ్ స్టార్ట్ చేసింది కాషాయ పార్టీ. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థులు ప్రచారం ప్రారంభించడం ప్లస్ పాయింట్‌గా మారింది.గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ బరిలోకి దిగకపోవడంతో అధికార కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా పోరు మారింది. దాంతో రెండు పార్టీలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.బీజేపీ నాయకత్వం మొత్తం రంగంలోకి దిగి తమదైన శైలిలో ప్రచారాన్ని హోరెత్తించింది. ఉత్తర తెలంగాణలో జరిగిన ఎన్నికలను డీల్ చేసేందుకు అటు సంఘ్ పరివార్, ఇటు బీజేపీ క్యాడర్‌ను ఫీల్డ్‌లోకి దించి ఎక్కడిక్కడ బాధ్యతలను అప్పగించారు. ముందుగా పార్టీ క్యాడర్‌తో మీటింగ్‌లు నిర్వహించి. ఎన్నికల్లో గెలుపు ఆవశ్యకతను చెప్పి వారిని సమాయాత్తం చేశారు. క్యాడర్‌ను మోటివేట్ చేసే బాధ్యతల్ని పార్టీలోని ఆర్గనైజింగ్ సెక్రటరీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తీసుకున్నారు.క్యాడర్‌కు శిక్షణ పూర్తికాగానే ఓటర్లను కలిసే కార్యక్రమానికి రూపకల్పన చేసి క్షేత్రస్థాయి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ వ్యవహారాలు అన్నీ చక్కదిద్దే బాధ్యతతో పాటు, ప్రచారాన్ని లీడ్ చేసారు కేంద్రమంత్రి బండి సంజయ్.. 25మందికి, 50మంది ఓటర్లకు ఒకరు చొప్పున పచ్చీస్ ప్రభారీ, పచాస్ ప్రభారీలను ఇన్చార్జులుగా నియమించి వారిని మానిటర్ చేసే పనిని సైతం సంజయ్ స్వయంగా చేపట్టారంటే బీజేపీ ఈ ఎన్నికలను ఎంత చాలెంజ్‌గా తీసుకుందో అర్దం చేసుకోవచ్చు.పచ్చీస్ ప్రభారీలతో కేంద్రమంత్రి నిత్యం మాట్లాడుతూ వారిని ఉత్తేజపరచడమే కాకుండా వారితో భారీ సమావేశాలను సైతం ఏర్పాటు చేసారు. కాంగ్రెస్ పార్టీ బహిరంగసభలను నిర్వహించి సీఎం రేవంత్‌తో ప్రసంగింప చేస్తే బీజేపీ రూట్ మార్చి ఇంచార్జిలతో సమావేశాలను నిర్వహించింది. ఆ ఇంచార్జ్‌లు ఒక్కొక్క ఓటరును కనీసం రెండ్రోజులకు ఓసారి కలిసేలా ప్లాన్ చేశారు. బీజేపీ తమకు ఉన్న అన్ని వనరులను ఉపయోగించి పట్టభద్రులకు, టీచర్లకు ఉన్న సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేసింది.వారి సమస్యలు తెలుసుకుని గత ప్రభుత్వం.. ప్రస్తుతం ప్రభుత్వం తీరును ఎండగడుతూ ప్రచారం సాగించింది. క్యాంపెయినింగ్ బాధ్యత అంతా తన భుజాలపై వేసుకున్న సంజయ్… తమ పార్టీ వివిధ సమస్యలపై పోరాడిన తీరును.. 317 జీవో.. నిరుద్యోగుల సమస్యలపై గతంలో చేసిన కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగడం బాగా కలిసి వచ్చింది. పైగా బీజేపీకి ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు ఈ స్థానం పరిధిలోనే ఉండటం. ఎంపీల్లో నలుగురు ఇక్కడే ఉండటం ప్లస్ పాయింట్‌గా మారింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు దాదాపు నెల రోజుల పాటు ఇతర పనులను పక్కనబెట్టి ఎమ్మెల్సీ పనిలోనే ఉండటం బాగా కలిసి వచ్చిందని చెప్పాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్