Sunday, September 8, 2024

జాబ్‌ కాలెండర్‌పై కసరత్తు..

- Advertisement -

జాబ్‌ కాలెండర్‌పై కసరత్తు..
హైదరాబాద్, జూలై 3,
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించటంతో వార్షిక జాజ్ కేలండర్ తయారీ పనిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ బిజీబిజీగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల వేళ.. నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల కాగా, మంగళవారం ఆర్టీసీలోని 3035 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి కొనసాగింపుగా ఆగస్టులో మరో 6000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపనుంది. గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన జాబ్‌ క్యాలెండర్‌తో పాటు గ్రూప్‌ 2, 3 పోస్టులు పెంచాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీంతో వీలున్నంత వేగంగా, పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో ఇప్పటికే రాత పరీక్ష దశలో ఉన్న నియామక ప్రక్రియను త్వరలోనే పూర్తి చేసి ఫలితాలు ప్రకటించేలా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు సూచనలు చేస్తోంది.ప్రజా రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్టీసీలో దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో మంగళవారం 3035 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఆర్టీసీలో 43వేల మంది పనిచేస్తుండగా, తాజాగా ఈ కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కారణంగా.. ఈ నోటిఫికేషన్‌లోని డ్రైవర్, శ్రామిక్, డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్), డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) తదితర ఉద్యోగాలను వీలున్నంత త్వరగా భర్తీ చేసి మరింత మెరుగైన ప్రయాణ సేవలను అందించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారుగతంలో విడుదలైన నోటిఫికేషన్లకు సంబంధించి రాత పరీక్షల దశలో ఉన్నవాటిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం గ్రూప్ 4 పరీక్ష పూర్తై, అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతోంది. గతంలో రద్దైన గ్రూప్ 1 నోటిఫికేషన్‌కు మరిన్ని పోస్టులు కలిపి కొత్త ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి, ప్రిలిమినరీ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నట్లు కమిషన్ ప్రకటించింది. అలాగే, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ కూడా విడుదలైంది. గ్రూప్‌ 2 పరీక్షను ఆగస్టులో నిర్వహించేందుకు కమిషన్ సన్నాహాలు చేస్తోంది. గతంలో ప్రశ్నపత్రాల లీకేజీతో రద్దైన డీఈవో లాంటి పరీక్షలు జరుగుతున్నాయి. హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్స్‌ పరీక్షలు పూర్తయ్యాయి. గురుకులాలకు సంబంధించి అన్ని ప్రక్రియలు పూర్తయి పోస్టింగ్‌ల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఆ ప్రక్రియను కూడా త్వరలోనే పూర్తి చేయనున్నారు. ఈ పెండింగ్ నోటిఫికేషన్లు అన్నీ పూర్తై వీటి ఫలితాలు ప్రకటించగానే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.రాబోయే అసెంబ్లీ సమావేశాల నాటికి జాబ్‌ క్యాలెండర్‌తో పాటు కొత్త నోటిఫికేషన్ల మీద ప్రభుత్వం ఒక క్లారిటీకి రానుంది. అలాగే నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రకటన చేసింది. కొడంగల్, మధిర నియోజక వర్గాల్లో 20 ఎకరాల విస్తీర్ణంలో ఒకేచోట ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ గురుకులాలన్నింటినీ ఒకే ప్రాంగణంలోకి తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో ఈ కేంపస్‌లు అందుబాటులోకి వస్తే.. ఇప్పుడున్న గురుకులాల సిబ్బందికి తోడు మరో 4 వేల మంది అవసరం కావచ్చు. వీటికి ఖాళీగా ఉన్న మరో 2 వేల ఉద్యోగాలు కలిపి.. మొత్తం 6 వేల పోస్టులతో నోటిఫికేషన్ వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్