- Advertisement -
ముగిసిన కరీంనగర్ మున్సిపల్ పాలక వర్గం పదవీకాలం
Expired Karimnagar Municipal Ruling Class Term
చివరి రోజు కార్పొరేటర్లను సన్మానించేందుకు ప్రత్యేక సమావేశం
కాషాయ కండువా కప్పుకుని… కార్పొరేటర్లను సన్మానించేందుకు సిద్ధమైన మేయర్ సునీల్ రావు
బిజెపి కండువా కప్పుకుని… సన్మానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ. సమావేశం నుండి వాకౌట్ చేసిన బిఆర్ఎస్ కార్పొరేటర్లు.
మేయర్ కు వ్యతిరేకంగా నినాదాలు
కరీంనగర్ నగర పాలక సంస్థలో స్వల్ప ఉద్రిక్తత
కరీంనగర్
కరీంనగర్ నగర పాలక సంస్థ గడువు ముగిసింది. ముగింపు సందర్భంగా కార్పొరేటర్లకు సన్మానం ఏర్పాటు చేయక బిఆర్ఎస్ కార్పొరేటర్ నిరసన ఆందోళన స్వల్ప ఉధృతకు దారి తీసింది. మేయర్ సునీల్ రావు మూడురోజుల క్రితం బిఆర్ఎస్ ను వీడి బిజెపిలో చేరడంతో బిఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన ఆందోళన వ్యక్తం చేశారు. మేయర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళా కార్పొరేటర్ భర్తలను సమావేశంలోకి అనుమతించకుండా గేటు వద్దనే పోలీసులు అడ్డుకోవడం పై నిరసన తెలిపారు. నిరసన ఆందోళనతో మహిళా కార్పొరేటర్ ల భర్తలను సమావేశంలోకి అనుమతించారు. కాషాయ కండువా కప్పుకుని మేయర్ కార్పోరేటర్ లను సన్మానించడాన్ని వ్యతిరేకించారు. సాంప్రదాయ పద్దతిలో సన్మానం చేయకుండా కాషాయ కండువా కప్పుకుని సన్మానం చేయడం అవమానకరంగా భావిస్తు సమావేశం నుండి బిఆర్ఎస్ కార్పోరేటర్ లు వాకౌట్ చేశారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య కరీంనగర్ నగర పాలక సంస్థ చివరి సమావేశం స్వల్ప ఉద్రిక్తతతో ముగిసింది.
- Advertisement -



