Sunday, September 8, 2024

బియ్యంపై ఎగుమతిపై ఆంక్షలు

- Advertisement -
Export restrictions on rice
Export restrictions on rice

న్యూఢిల్లీ, నవంబర్ 20, (వాయిస్ టుడే): ప్రపంచంలోని అగ్రశ్రేణి బియ్యం ఎగుమతిదారుగా ఉన్న భారతదేశం, వచ్చే ఏడాది కూడా విదేశీ అమ్మకాలపై తన నియంత్రణలను కొనసాగించగలదని భావిస్తోంది. 2008 ఆహార సంక్షోభం తర్వాత తక్కువ ధరలతో పాటూ పుష్కలమైన నిల్వలు గల దేశంగా మార్చాలని ప్రయత్నిస్తోంది. తద్వారా గత దశాబ్ద కాలంగా భారతదేశాన్ని ధాన్యం ఎగుమతి చేసే దేశంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది. ఇటీవల వెల్లడైన లెక్కల్లో 40 శాతం వాటాను కలిగి.. ప్రపంచ దేశాల్లోనే భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఆఫ్రికన్ దేశాలు మన నుంచి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నాయి. అయితే వచ్చే ఏడాది మళ్లీ ఎన్నికలకు వెళ్లనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ క్రమంలో దేశీయ ధరలపెరుగుదలను అరికట్టడానికి, వినియోగదారులను అధిక ధరల నుంచి రక్షించేందుకు పదేపదే ఎగుమతులపై పరిమితులను విధిస్తున్నారు.దేశీయ బియ్యం ధరలు పెరిగినంత కాలం ఈ పరిమితులు కొనసాగే అవకాశం ఉంది” మాజీ-జపాన్ చీఫ్ ఎకనామిస్ట్ సోనాల్ వర్మ అన్నారు. “ఎన్నికల తర్వాత కూడా దేశీయ బియ్యం ధరలు స్థిరంగా ఉండకపోతే, ఈ చర్యలు పొడిగించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. భారతదేశం విరిగిన బాస్మతీ రైస్, వైట్ రైస్ పై ఎగుమతి సుంకాలు విధించింది. అందుకే వాటిని ఆ దేశం నుంచి ఎగుమతి చేసుకోలేమని తెలిపారు. దీని ఫలితంగా ఆగస్టులో ధరలు 15 సంవత్సరాల గరిష్ట స్థాయికి పెరిగాయి. అందుకే కొందరు దిగుమతి చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. యూనైటెడ్ నేషన్ ఆహార, వ్యవసాయ సంస్థ ప్రకారం, అక్టోబర్‌లో బియ్యం నిలువలు సంవత్సరం క్రితం ఉన్న దానికంటే 24 శాతం ఎక్కువ ఉన్నట్లు తెలిపింది.మోదీ ప్రభుత్వం ఇంటింటికీ సరిపడా బియ్యం బియ్యాన్ని సరఫరా చేయడం ద్వారా ధరలను నియంత్రించాలని భావిస్తోందని బివి కృష్ణారావు తెలిపారు. ఈయన దేశంలోని రవాణాదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న బియ్యం ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు పూర్తై ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకూ ప్రభుత్వం ఎగుమతి ఆంక్షలను కొనసాగించవచ్చని ఆయన అన్నారు. ఎల్ నినో కారణంగా ఆసియా అంతటా పంటలు నాశనమయ్యాయని పేర్కొన్నారు. పొడి వాతావరణం కారణంగా 2023-24లో ఎగుమతిదారులో రెండవ స్థానంలో ఉన్న వరి ఉత్పత్తి 6 శాతం పడిపోయే అవకాశం ఉందని థాయ్‌లాండ్ ప్రభుత్వం తెలిపింది.వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం, అకాల వర్షాలు, రుతుపవనాలలో జాప్యం కారణంగా అంతకు ముందు సంవత్సరం కంటే దాదాపు 4 శాతం పడిపోవచ్చు. జూన్ నుండి సెప్టెంబర్ వరకు రుతుపవనాలు ఆశించినంత సత్ఫలితాలు ఇవ్వలేదు. ఐదేళ్లలో అత్యంత బలహీనమైన వర్షపాతం నెలకొందని తెలిపారు. 800 మిలియన్లకు పైగా ప్రజలకు ఉచిత ఆహార కార్యక్రమం ద్వారా ప్రయోజనం చేకూర్చేందుకు అవసరమైన స్టాక్ అందుబాటులో ఉన్నాయనని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి.ఆహార మంత్రిత్వ శాఖల ప్రతినిధి మాట్లాడుతూ ప్రభుత్వం ఆహార ధరలపై నిరంతరం నిఘా ఉంచుతుందని, వినియోగదారులతో పాటు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సరైన సమయంలో ఎగుమతులపై తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఈ విధానం ద్వారా ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో డబ్బులు లేని పేదవారికి ప్రయోజనం చేకూరుస్తుంది. భారత్ ఎగుమతులను నిలిపివేసిన కారణంగా.. సెప్టెంబరులో ఫిలిప్పీన్స్‌లో బియ్యం ద్రవ్యోల్బణం 14 సంవత్సరాల గరిష్ట స్థాయికి పెరిగింది. అంతేకాకుండా ఇండోనేషియా, నైజీరియా, పశ్చిమ ఆఫ్రికాలో కూడా దీని ప్రభావం తీవ్రంగా పడింది. పశ్చిమాఫ్రికాలో ప్రధాన ద్రవ్యోల్బణం 26.7 శాతం పెరగడంతో ఈ నెలలో వార్షిక ఆహార ద్రవ్యోల్బణం 30.6 శాతానికి పెరిగిందని చెబుతున్నారు ఆ దేశ ప్రతినిధులు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్