Sunday, September 8, 2024

నూతన చట్టాలతో ప్రమాదంలో భావ వ్యక్తీకరణ

- Advertisement -

నూతన చట్టాలతో ప్రమాదంలో భావ వ్యక్తీకరణ
బాధితులనే బాధించే అవకాశం
కొన్ని కేసుల్లో పోలీసులకు విస్తృత అధికారం
నూతన చట్టాలు – సమాజంపై ప్రభావం
సెమినార్ లో సీనియర్ న్యాయవాది.  విద్యాసాగర్ రెడ్డి
ఖమ్మం:

Expression at risk with new laws

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన చట్టాలతో భావ వ్యక్తీకరణకు ప్రమాదం ఏర్పడిందని ప్రశ్నించే తత్వాన్ని చంపేసే విధంగా చట్టాలు రూపొందించబడ్డాయని సీనియర్ న్యాయవాది గంటా విద్యాసాగర్ రెడ్డి తెలిపారు. కొన్ని కేసుల్లో పోలీసులకు విస్తృత అధికారం కల్పించడం సహేతుకం కాదన్నారు.  సిపిఐ కార్యాలయంలో నూతన చట్టాలు సమాజంపై ప్రభావం అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సెమినార్లో విద్యాసాగర్రెడ్డి మాట్లాడుతూ గత చట్టాలు బ్రిటిష్ పాలనలో రూపొందించబడ్డాయని నూతన చట్టాల రూపకల్పన పై దృష్టిసారించిన ప్రభుత్వం కులంకుషంగా చర్చించకుండానే చట్టాల అమలుకు పూనుకుందని కేవలం 43గంటల 23 సెకన్లు మాత్రమే చర్చించారని ఆయన తెలిపారు. పేరు బ్రిటిష్ చట్టాలదే అయినా చట్టాల మార్పు వెనక బిజెపి మార్క్ దాగి ఉందని 10 శాతం గతంలో ఉన్న భారతీయ శిక్షాస్మృతిని మార్చి భారతీయ న్యాయ సంహితను తీసుకు వచ్చారని ఇందులో సాంకేతికత పరిజ్ఞానానికి ప్రాధాన్యత నివ్వడంతో కేసుల్లో పారదర్శకత లోపిస్తుందని ఆయన తెలిపారు. ఏ తప్పుకు ఏ శిక్ష అన్నది భారతీయ శిక్షాస్మృతి ప్రకారమే తీసుకుని భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక్ సురక్ష సంహిత భారతీయ సాక్ష్యా సంహిత చట్టాలను తీసుకు వచ్చారని విద్యాసాగర్ రెడ్డి తెలిపారు. పార్లమెంటులో విపక్షాన్ని బయటకు పంపి 20 డిసెంబరు 2023న పార్లమెంటులో 21 డిసెంబరు 2023న రాజ్యసభలో ఆమోదం పొంది 25 డిసెంబరు 2023న గెజిట్ గా రూపొందించబడిందని ఆయన తెలిపారు. ఈ చట్టాల అమలు వల్ల దుష్పరిణామాలను పరిగణలోకి తీసుకో లేదని ఐపిసిలో 511 సెక్షన్లు ఉంటే భారతీయ న్యాయ సంహితలో 358కి కుదించారని ఆయన తెలిపారు. 124 ఎ సెక్షన్లో గతంలో ఉన్న రాజ ద్రోహం స్థానే దేశ ద్రోహం చట్టాన్ని తీసుకు వచ్చారని ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్)లోని 163వ సెక్షన్ సోషల్ మీడియాలో ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రచారం నిర్వహించినా దేశ ద్రోహం కేసు నమోదు చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కొన్నింటిలో పోలీసుల జోక్యాన్ని తగ్గించారని ముఖ్యంగా తూనికలు, కొలతలకు సంబంధించి గతంలో పోలీసులు తనిఖీలు చేసి కేసులు నమోదు చేసే వారని కానీ ఇప్పుడు పోలీసులకు అవకాశం లేదని కేవలం ఆ శాఖాధికారులు మాత్రమే తనిఖీలు నిర్వహించనున్నారని తెలిపారు. కొన్ని
చట్టాలను కఠినతరం చేశారని గతంలో సాధారణ శిక్షల స్థానే ఇప్పుడు జీవితకాల ఖైదు, మరణ శిక్షను సైతం

 

Expression at risk with new laws

విధించేవిధంగా చట్టాలను రూపొందించారన్నారు. ఇప్పుడు 16 ఏళ్ల లోపు బాలికపై అత్యాచారం జరిగితే కనీసం 20 ఏళ్లు శిక్షపడే అవకాశం ఉందన్నారు. గతంలో జీవిత ఖైదు అంటే కొన్నేళ్లకు పరిమితమయ్యేదని కానీ ఇప్పుడు సహాజ సిద్దమైన జీవితం ఉన్నంత కాలం ఖైదు విధించే అవకాశం ఉందన్నారు. నూతన చట్టాలు ఒకటి జూలై 2024 నుంచి అమల్లోకి వచ్చిన గతంలో ఐపిసి ప్రకారం నమోదైన కేసులను ఆ సెక్షన్ల ద్వారానే విచారిస్తారని పాత కేసులు పూర్తయ్యే వరకు కొత్త, పాత చట్టాలతో పని చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఫోక్సో లాంటి కేసుల్లో బాధితురాలి పేరును కానీ, కుటుంబ పేరును కానీ విచారణ పూర్తయ్యేంత వరకు బహిర్గత పర్చరాదని పోలీసులు సైతం వివరాలు సీల్డ్ కవర్లో న్యాయమూర్తికి అందించి పేరుకు బదులు బాధితురాలి పేరును వాడాల్సి ఉంటుందని విద్యా సాగర్ రెడ్డి సూచించారు. మీడియా సైతం బాధితురాలి పేరును ఉచ్చరిస్తే శిక్షించే అవకాశం ఉందన్నారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి గతంలో ఉన్న చట్టాలను ఇప్పుడు తీవ్రతరం చేశారని ఢీకొట్టి పారిపోవడం లాంటివి చేస్తే పదేళ్ల వరకు శిక్ష ఉండే అవకాశం ఉందని నాన్బెయిలబుల్ కేసులు 102 (2) బిఎన్ఎస్ ప్రకారం నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయవచ్చునన్నారు. ప్రభుత్వాల పట్ల కానీ, ప్రజాప్రతినిధుల పట్ల కానీ దురుసుగా ప్రవర్తించడం, అడ్డుకోవడం లేదా బెదిరింపులకు పాల్పడడం ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించడం లాంటి వాటిని నేరాలుగా పరిగణించి ప్రస్తుత నూతన చట్టాలలో శిక్షను ఖరారు చేశారని ఆయన తెలిపారు. కొన్ని సెక్షన్లలో పోలీసులకు విపరీతమైన అధికారాలు ఇచ్చారని గతంలో రెవెన్యూ అనుమతితో కూడిన చట్టాలు అమలయ్యే అవకాశం ఉండగా ఇప్పుడు పోలీసులే నేరుగా చట్టాన్ని అమలు చేసే అవకాశం ఉందని విద్యాసాగర్ రెడ్డి తెలిపారు. ఇది ప్రశ్నించే గొంతుకలను నొక్కేయడమేనన్నారు. గతంలో హత్యాయత్నం కేసుకు సంబంధించి నేరం జరిగిన తీరును బట్టి జీవిత ఖైదు లేదా పదేళ్లు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. అన్నింటికి మించి మోడీ, అమిత్ షాలను మాత్రమే సంప్రదించి ఈ చట్టాలను అమలు చేశారని ఇందులో న్యాయ నిపుణులను కానీ బార్ కౌన్సిల్స్ను కానీ పరిగణలోకి తీసుకోలేదన్నారు. కలెక్టర్ కొన్ని కేసులకు సంబంధించి స్పెషల్ ఎగ్జిక్యూటీవ్ మేజిస్ట్రేట్ను నియమించే అవకాశం ఉందని ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమని ఇది అధికార దుర్వినియోగానికి అవకాశం ఇస్తుందని ఆయన తెలిపారు. భారతీయ సాక్ష్యా సంహితలో సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినసాక్ష్యాలను పరిగణలోకి తీసుకుంటున్నారని మారిన పరిస్థితుల్లో ఇది దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని మార్ఫింగ్ జరగడం ద్వారా నిందితులు తప్పించుకోవడం లేదా నేరస్తులు కానీ వారిని నేరస్తులుగా నిరూపించేఅవకాశం ఉందని విద్యాసాగర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మహిళలపై దాడులకు సంబంధించి పోలీసులు అప్పటికప్పుడు ఎఫ్ ఐఆర్ చేయకుండా 14 రోజుల పాటు కాలయాపన ను ఉన్నతాధికారి అనుమతితో చేసే అవకాశం ఉందని దీని వల్ల కొన్ని సందర్భాలలో కేసులు తారుమారు అయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. గతంలో ఓ కేసు నమోదైనప్పుడు అప్పుడు బాధ్యతల్లో ఉన్న అధికారి మాత్రమే కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సి వచ్చేదని కానీ ఇప్పుడు ఆ స్థానంలో వచ్చిన అధికారులు ఎవరైనా సాక్ష్యం చెప్పే వెసులుబాటు కల్పించారని దీని వల్ల తీర్పుల్లో న్యాయం జరగక పోవచ్చునని ఆయన అన్నారు. ఈ సెమినార్లో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహ్మద్ మౌలానా, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి. యర్రాబాబు, ఎస్కె జానిమియా, కొండపర్తి గోవిందరావు, కో ఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కనకం జనార్ధన్, ఐఏఎల్ నాయకులు పట్టాభి, ఎస్ కె లతీఫ్, ఓరుగంటి శేషగిరిరావు, ఎడ్యుకేషన్ సబ్ కమిటీ సభ్యులు శింగు నర్సింహారావు, ప్రముఖ న్యాయవాది ఎన్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్