- Advertisement -
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
Extreme low pressure in Bay of Bengal
విశాఖపట్నం
నైరుతి బంగాళఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని విశాఖ వాతావరణ శాఖ అధికారి తెలిపారు.ఇది రానున్న 24 గంటల్లో ఇది వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని,మరో 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి దాదాపు ఉత్తరం దిశగా పయనించే అవకాశం ఉందని,దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు పాటు ఉత్తరకోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో భారీ నుండి ఒకటి రెండు అతి భారీ వర్షాలు కురిసే ఆవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.తీరం వెంబడి 30 నుండి 35 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఆవకాశం ఉందని,రాబోయో మూడు రోజులు పాటు మత్స్యకారులు వేటకు వేటకు వెళ్ళురాదని సూచించారు.
- Advertisement -