నేత్రదానం మరో ఇద్దరికి కంటి చూపు
Eye donation gives eyesight to two others
లయన్స్ క్లబ్ డైరెక్టర్, మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణ రెడ్డి
కమాన్ పూర్
కళ్ళు మరో ఇద్దరికి కంటి చూపును ఇస్తాయి అని లైన్స్ క్లబ్ డైరెక్టర్ గంట వెంకటరమణారెడ్డి అన్నారు.
రామగిరి మండలం
కల్వచర్ల గ్రామవాసి జాపతి రాజయ్య అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులు తన యొక్క నేత్రాలను దానం చేయుటకు ముందుకు రావడం జరిగింది. ఇట్టి విషయం లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ డైరెక్టర్ ,మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే సదశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రావణ్, కార్యదర్శి లింగమూర్తి ని సంప్రదించగా వెంటనే కరీంనగర్ నుండి ఎల్ వి ప్రసాద్ సంస్థ నుండి వచ్చిన టెక్నీషియన్ ప్రదీప్ ,లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీకాలనీ సభ్యులు మేకల మారుతి యాదవ్ ఆధ్వర్యంలో జాపతి రాజయ్య నేత్రాలను సేకరించి హైదరాబాద్ కు పంపడం జరిగింది. అనంతరం మాజీ జడ్పీటీసీ గంట వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ
కళ్ళు మన శరీరంలో అత్యంత విలువైన భాగం కాబట్టి, వాటిని కాల్చివేయడం లేదా చనిపోయిన తర్వాత వాటిని పాతిపెట్టడం ద్వారా మనం దానిని వృధా చేయకూడదు. లక్షలాది మంది భారతీయులు కార్నియా అంధత్వంతో బాధపడుతున్నారు,నేత్రదానం ద్వారా మాత్రమే నయం చేయవచ్చు.కంటి ముందు భాగంలో ఉండే కార్నియా అనే పారదర్శక కణజాలం కంటి శుక్లాలను అభివృద్ధి చేస్తే, గాయం వల్ల, వ్యాధి వల్ల పోషకాహార లోపం కారణంగా, ఒక వ్యక్తికి దృష్టి లోపం కలుగుతుంది. కొన్నిసార్లు పూర్తిగా దృష్టిని కోల్పోతాడు అలా దెబ్బతిన్న కార్నియాను ఆరోగ్యకరమైన కార్నియాతో భర్తీ చేయడం ద్వారా కార్నియల్ అంధత్వంను తగ్గించవచ్చు. ఇది నేత్రదానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఒకరికి దృష్టిని బహుమతిగా ఇవ్వడం ఎంతో గౌరవప్రదమైన విషయం అని అలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్నా జాపతి రాజయ్య కుమారులు శ్రీనివాస్,శేఖర్ కూతురు రమ మరియు కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్ సభ్యులు నూక రమేష్,సమ్మయ్య మరియు గొట్టెముక్కుల మల్లేష్ ,బిరుదు లక్ష్మణ్, కొట్టే వేణు,విరవెన సదానందం తదితరులు పాల్గొన్నారు.