నకిలీ పెరుగు గుట్టు రట్టు

- Advertisement -

నకిలీ పెరుగు గుట్టు రట్టు
మేడ్చల్ మల్కాజిగిరి

Fake curd racket busted
కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని వైష్ణవి ఎన్క్లేవ్ లో నందిని మిల్క్ సెంటర్లో అక్రమంగా కల్తీ పెరుగు, కల్తీ కోవా తయారీ సెంటర్ పై మల్కాజిగిరి ఎస్.ఓ.టీ పోలీసులు దాడి చేశారు. సుమారు 120 కిలోల కల్తీ పెరుగు, 6 కిలోల కోవాను తరలిస్తున్న రామచందర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని టాటా ఏస్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్.ఓ.టీ ఎస్సై సాయికుమార్ మాట్లాడుతూ కల్తీ పాలకోవా, కల్తీ పెరుగును తయారు చేస్తూ మ్యానుఫ్యాక్చర్ డేటు, ఎక్స్పైరీ డేటుతో పాటు, ఎలాంటి లేబల్ వేయకుండా చాలా కాలంగా అక్రమంగా విక్రయిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం మేరకు నందిని మిల్క్ సెంటర్ పై మల్కాజ్గిరి ఎస్ఓటి ఎస్సై సాయికుమార్, ఎస్వోటీ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం మెరుపు దాడులు చేశామని తెలిపారు. కల్తీ వస్తువులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని, టాటా ఏసీ వాహనాలను సీజ్ చేశారు ఎస్ఓటి పోలీసులు. నందిని మిల్క్ పార్లర్ ఓనర్ రామచందర్ ను అదుపులోకి తీసుకున్నారు. పెరుగు, కోవా శాంపిల్ లను ఫుడ్ సేప్టీ ఇన్స్పెక్టర్ కు పంపించి పూర్తి ఆధారాలు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు నందిని మిల్క్ పార్లర్ లో తనిఖీలు నిర్వహించగా దాదాపు 1000 కిలోల పెరుగు, 50 కిలోల కోవా నిలువ ఉంచినట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ వారికి హానిచేసే కల్తీ ఆహార పదార్థాలు, నకిలీ వస్తువులు ఎవరైనా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మల్కాజిగిరి ఎస్వోటీ ఎస్సై సాయికుమార్ హెచ్చరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular