‘ది ప్యారడైజ్’కు టికెట్ ధరల పెంపునకు అనుమతి

- Advertisement -

‘ది ప్యారడైజ్’కు టికెట్ ధరల పెంపునకు అనుమతి

సెప్టెంబర్ 23న సాయంత్రం 6.30 గంటలకు ప్రత్యేక ప్రీమియర్‌ షో

Permission granted to hike ticket prices for ‘The Paradise’

హైదరాబాద్: నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రీమియర్‌ షోతో పాటు టికెట్ ధరల పెంపునకు అనుమతించింది. సెప్టెంబర్ 23న సాయంత్రం 6.30 గంటలకు ప్రత్యేక ప్రీమియర్‌ షో నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ షోకు టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ.500గా నిర్ణయించింది.

సినిమా విడుదల రోజు నుంచి సెప్టెంబర్ 27 వరకు మల్టీప్లెక్స్‌లలో టికెట్‌పై రూ.94, సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.48 చొప్పున జీఎస్టీతో కలిపి అదనంగా వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు మల్టీప్లెక్స్‌లలో రూ.45, సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.23 చొప్పున టికెట్ ధర పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.

అదే సమయంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు రూ.1 కోటి విరాళంగా అందించాలని నిర్మాతను ప్రభుత్వం ఆదేశించింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular