పోలీసుల వలలో నకిలీ డీఎస్పీ
సూర్యాపేట
Fake DSP caught in police trap
ఉద్యోగాలు ఇప్పిస్తానని యువతనుంచి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ డీఎస్పిని పోలీసులు అరెస్టు చేసారు. నిందితునుంచి 18 లక్షల నగదు, ఒక కారు, పోలీస్ యూనిఫాం, 2 డమ్మీ మ్యాన్ ప్యాక్ లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ నరసింహా సోమవారం నాడు మీడియా సమావేశం లో ఈ విషయం వెల్లడించారు. సోమవారం నాడు ఉదయం శ్రీ గ్రాండ్ హోటల్ నందు ఒక వ్యక్తి అనుమానాస్పదం గా ఉన్నాడు అనే హోటల్ యాజమాన్యం సమాచారం ఇచ్చింది. పోలీసులు వెంటనే శ్రీ గ్రాండ్ హోటల్ కి వెళ్ళి అక్కడ ఉన్న వ్యక్తిని అదుపు లోకి తీసుకుకన్నారు. అక్కడున్న ఒక బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారించారు. నిందితుడు బతుల శ్రీనివాస్ రావు (35) మట్టపల్లి గ్రామానికి చెందినవాడు. తనను తాను డీఎస్పీగా గా పరిచయం చేసుకొని అమాయకమైన నిరుద్యోగులకు పోలీస్ డిపార్ట్మెంట్ లో, సివిల్ సప్లయ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వద్ద డబ్బులు తీసుకుంటున్నానడని గుర్తించారు. గతంలో ఇతని పై మటంపల్లి, రాజముండ్రి 2 టౌన్, నర్సరావపేట రూరల్, త్రిపురాంతకం, మెడికొండూరు. మార్కాపురం లలో కేసులు నమోదయ్యాయి. అదే విధంగా కోదాడ లో ఒక అమ్మాయికి ఎస్సై ఉద్యోగం ఇప్పిస్తానని ఆమె వద్ద రూ. 36,00,000/- (ముప్పై ఆరు లక్షలు), మార్టూరు కి చెందిన వ్యక్తి వద్ద కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తానని అతని వద్ద కొంత నగదు, గురజాల కి చెందిన వ్యక్తి వద్ద జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు లు తీసుకున్నాడు. కోదాడ కి చెందిన అమ్మాయి ఎస్సై ఉద్యోగం కోసం ఇచ్చిన డబ్బులలో మిగిలిన పద్దెనిమిది లక్షలు నిందితుడునుంచి రికవరీ చేసారు.