Wednesday, April 15, 2026

నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల విలువైన నకిలీ మందులు స్వాధీనం

- Advertisement -

రాష్ట్ర చరిత్రలోనే క్యాన్సర్ నివారణ కై ఉపయోగించే అతిపెద్ద నకిలీ మందుల తయారీ దారులను నగరంలోని మచ్చ బొల్లారంలో  తెలంగాణా ర్రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. వీరి నుండి దాదాపు నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల విలువైన నకిలీ క్యాన్సర్ నివారణ మందులను స్వాధీన పర్చుకున్నామని డ్రగ్స్ కంట్రోల్ విభాగం డైరెక్టర్ జనరల్ వీ.బి. కమల హాసన్ రెడ్డి వెల్లడించారు.

డీజీ కమల్ హాసన్ రెడ్డి కధనం ప్రకారం, ఆస్ట్రిక హెల్త్ కేర్ అనే కంపెనీ క్యాన్సర్ నివారణ కు ఉపయోగించే మందులను నకిలీ, కల్తీ మందులను తయారు చేసి మార్కెట్ లో విక్రయిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం అందడంతో ఈనెల రెండవ తేదీన డ్రగ్స్ కంట్రోల్ విభాగానికి చెందిన విజిలెన్స్ ప్రత్యేక బృందాలు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించిందని వివరించారు. ఈ నకిలీ మందుల చెలామణికి సంబందించిన ఇన్వాయిస్ ల ద్వారా పోస్టల్ శాఖ  ద్వారా కంపెనీ చిరునామాకై ఆల్వాల్ తో వెతకగా అది తప్పుడు అడ్రస్ గా నిర్దారణ అయిందని అన్నారు.  అనంతరం, ఐడిఎ చర్లపల్లి, నాచారం, మేడ్చల్ లలోని వివిధ కొరియర్ కార్యాలయాలను తనిఖీ చేసి ఆస్ట్రిక హెల్త్ కేర్ ద్వారా పంపిణీ అయినవాటిని తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు.  డ్రగ్స్ కంట్రోల్ విభాగానికి చెందిన విజిలెన్స్ మరొక ప్రత్యేక బృందం కీసర లోని ఆస్ట్రిక హెల్త్ కేర్ సంస్థపై దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు.

‘ఆస్ట్రికా హెల్త్‌కేర్’ ప్రాంగణం నుండి నకిలీ డ్రగ్ స్టాక్ డెలివరీ చేస్తున్న కొరియర్ బాయ్‌ని డీసీఏ అధికారులు గుర్తించారు.  మచ్చ బొల్లారం వద్ద మూడు షట్టర్లలో ఈ నకిలీ మందులు నిల్వ చేయబడ్డాయి.

డిసెంబర్ 4 న ఈ నకిలీ మందులతయారీ  లొకేషన్ దాడి చేసి నాలుగు కోట్ల 35 లక్షల విలువైన  36 రకాల క్యాన్సర్‌ నివారణ మందులు, ఇతర మందులను స్వాధీనం చేసుకున్నారు. ఈ  స్వాధీనం చేసుకున్న కొన్నిమందులలో నకిలీ స్వభావం కలిగి ఉన్నట్లు కనుగొనబడింది . మందుల లేబుల్స్ ఉనికిలో లేని కంపెనీ ‘ఆస్ట్రా జెనెరిక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ వివరాలను కలిగి ఉన్నాయనిన్ తెలిపారు.  ఇవి, జూలై-2021లో వీరి లైసెన్స్‌లు ఇప్పటికే రద్దు చేయబడ్డాయి, కానీ తయారీ స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌పై తేదీ మార్చి-2023 పేరుతో పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్