- Advertisement -
కన్న తండ్రి ని బస్టాప్ లో వదిలేసినా కుటుంబ సభ్యులు
Family members left own father at the bus stop
అల్వాల్
ఓ వృద్దుడిని అతని కుటుంబ సభ్యులు బస్టాప్లో వదిలేసి వెళ్లిన ఘటన ఆల్వాల్ లో వెలుగుచుసింది.స్థానికుల సమాచారం మేరకు గురువారం రాత్రి ఓ వృద్దుడిని ఆటోలో తీసుకోని వచ్చి ఆల్వాల్ బస్టాప్లో కుటుంబ సభ్యులు వదిలేసి వెళ్లారని,దిక్కుతోచని స్థితిలో చలిలో వణుకుతున్న ఉన్న అతడిని చుసిన స్థానికులు ప్రశ్నించగా సికింద్రాబాద్ కు చెందిన గోవర్ధన్ రెడ్డి అని తెలిపాడు.అతడిని అతని కుటుంబ సభ్యులే ఇక్కడ వదిలేసి వెళ్లారని తెలిపాడు.అతని కుటుంబ సభ్యుల పై స్థానికులు అసలు వళ్లు మనుషులేనా మానవత్వం లేదా అంటూ మండిపడుతున్నారు.సంఘటన స్థలానికి చేరుకున్న ఆల్వాల్ పోలీసులు వృద్దుడి వివరాలు సేకరించారు.
- Advertisement -