ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట విషాదం

- Advertisement -

హైదరాబాద్:అక్టోబర్ 10:  దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి సోమవారం రాత్రి  కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంగా బాధ పడుతున్న శ్యామ్ సుందర్ రెడ్డి.సోమవారం రాత్రి 10 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 86 ఏళ్లు. అనారోగ్యంతో బాధపడుతున్న శ్యామ్ సుందర్ రెడ్డిని ఆస్పత్రిలో చేర్పించగా..చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే కన్నుమూశారు.

నిజామాబాద్ జిల్లా నర్సింగ్‌పల్లికి చెందిన శ్యాంసుందర్ రెడ్డి, ప్రమీల దంపతులకు ముగ్గురు కుమారులు. వారి పేర్లు: విజయ్ సింహారెడ్డి, నరసింహారెడ్డి, వెంకటరమణారెడ్డి. వీరిలో చిన్న వారైన వెంకటరమణారెడ్డిని ఇంట్లో వాళ్లు చిన్నతనం నుంచి ముద్దుగా రాజు అని పిలిచేవారు. అదే పేరుతో ఆయన ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు.

పైచదువుల కోసం నిజామాబాద్ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన దిల్ రాజు.ఇక్కడే స్థిరపడ్డారు. ఆయన నిర్మాతగా మారి తెరకెక్కించిన తొలి సినిమా ‘దిల్’ సూపర్ హిట్ కావడంతో..దిల్ రాజు’ ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి అంత్యక్రియలు మంగళవారం ఉదయం మహాప్రస్థానం’లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular