పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ ఢం సంపాదించుకున్న బన్నీ.. పుష్ప 2 కోసం బాగా కష్టపడుతున్నాడు. ఏప్రిల్ 8 బన్నీ బర్త్ డే కావడంతో పుష్ప 2 టిజర్ రిలీజ్ చేసింది మూవీ టీం.
బన్నీ బర్త్ డే కావడంతో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద అభిమానులు సందడి చేశారు. తమ అభిమాన నటుడిని చూసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వందల సంఖ్యలో అభిమానులు బన్నీ నివాసానికి చేరుకున్నారు.
బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన ఇంటికి వద్దకు చేరుకున్న అభిమానుల తాకిడి ఎక్కువ అవడంతో భద్రతా సిబ్బంది పోలీసులు బన్నీ ఇంటిదగ్గర ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూశారు. బన్నీ పెద్ద కటౌట్‌కి పాలాభిషేకం చేశారు. రాజులకే రాజు పుష్పరాజు అంటూ ఐకాన్ స్టార్ బన్నీని చూసేందుకు ఇంటికి వచ్చారు. అమ్మాయిలు, అబ్బాయిలు, పెద్ద, చిన్న తేడా లేకుండా బన్నీ ఇంటి వద్ద సందడిగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించేందుకు వచ్చారు. బన్నీ బయటకి వచ్చి అభిమానులను చూసి వెళ్ళిన తరవాత అభిమానులు అంతా కేక్ కటింగ్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.
పుష్ప మూవీ పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవడంతో పుష్ప 2 కోసం భారీగా కసరతులు చేస్తున్నారు మూవీ టీం. బన్నీ అభిమానులు చూసేందుకు బయటకు వచ్చిన సమయంలో కేరింతలు, బర్త్డే విషెస్‌తో ఆయన ఇంటి వద్ద పండగ వాతావరణం నెలకొంది. కేక్స్, ఫ్లవర్ బొకేలు, గిఫ్ట్స్, టపాసులతో అభిమానులు పెద్ద ఎత్తున బన్నీ ఇంటి వద్ద సందడి చేశారు. బన్నీని చూసేందుకు వచ్చిన అభిమానుల్లో చాలా మంది వివిధ రాష్ట్రాలకు చెందని వారు కావడం విశేషం. బన్నీ దృష్టిలో పడేందుకు ‘ఫ్యాన్ ఫ్రమ్ గుజరాత్’ అంటూ ఫ్లకార్డ్ చూపిస్తూ విష్ చేశారు కొందరు అభిమానులు.