Friday, December 13, 2024

రేవంత్ బయోగ్రఫిని రెడీ చేస్తున్న ఫ్యాన్స్

- Advertisement -

హైదరాబాద్, నవంబర్ 9, (వాయిస్ టుడే):  తెలంగాణలో  అధికార పార్టీ వైపు కేసీఆర్  శిఖరంలా నిలబడి మూడో సారి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ శిఖరాన్ని ఢీ కొట్టేందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి రూపంలో మరో శిఖరం సిద్ధమయిందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. తెలంగాణ రాజకీయాలు అన్నీ రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి. ప్రతి విషయాన్ని రేవంత్ రెడ్డికి అన్వయించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నారు.దీంతో ఆయననే బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తోందని.. కేసీఆర్ కు ధీటుగా ఆయనే ఉన్నారని ఇంత కంటే ప్రత్యేక సాక్ష్యం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకు వచ్చేందుకు రేవంత్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు. రోజుకు మూడు, నాలుగు నియోజకవర్గాల్లో సభలు పెడుతున్నారు. ఆ సభలకు జనస్పందన భారీగా ఉంటుంది. రేవంత్ రెడ్డి కి గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ హైకమాండ్ హెలికాఫ్టర్ కేటాయించింది. కానీ అప్పట్లో ఆయనకు పార్టీపై ఇంత పట్టు లేదు. ఇప్పుడు టీ పీసీసీ చీఫ్ గా ఉన్నారు.  అంతా ఆయన హవా ఉందని.. టిక్కెట్లు రాని వాళ్లు ఆయనపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. వచ్చిన వాళ్లు..  పార్టీకి విధేయంగా ఉన్న వాళ్లు కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది రేవంత్ వల్లేనని ఆయన పుట్టిన రోజును గట్టిగా సెలబ్రేట్ చేసుకున్నాయి. ఉదయమే రేవంత్ కు విషెష్ చెప్పేందుకు వేల మంది  ఆయన ఇంటి వద్దకు రావడం రేవంత్ క్రేజ్ కు నిదర్శనం. రేవంత్ రెడ్డికి ఎలాంటి రాజకీయ నేపధ్యం లేదు. ఆయన కింది స్థాయి నుంచి రాజకీయ నేతగా ఎదిగారు. మొదట జడ్పిటీసీగా ఇండిపెండెంట్ గా గెలిచారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలను ఎదుర్కొని మిడ్జిల్ నుంచి జడ్పీటీసీగా స్వతంత్రంగా గెలిచారు. అక్కడే ఆయన ప్రజలను ఆకట్టుకునే  నాయకత్వం బయటపడింది. తర్వాత ఎమ్మెల్సీగా కూడా ఇండిపెండెంట్ గా గెలిచారు. తర్వాత అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ  తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించినా ఆయన టీడీపీలో చేరారు.

అంచెలంచెలుగా ఎదిగారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా రాజకీయ పునరేకీకరణ కోసం కాంగ్రెస్ లో చేరి ఆ దిశగా ఇప్పుడు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎప్పుడూ రేవంత్ అధికార పార్టీలో లేరు. ప్రతిపక్షంలోనే ఉన్నారు. ఆయన ఆయన ప్రజల అభిమానాన్ని నిరంతరం పెంచుకుంటూనే పోయారు. ఆయన రాజకీయ పయనం స్ఫూర్తిదాయమైనదని.. ఆయన ఫ్యాన్స్ ఓ బయోగ్రఫీని రెడీ చేస్తున్నారు. తెలంగాణ బయోగ్రఫీ పేరుతో అనుముల రేవంత్ రెడ్డి  ప్రజాపోరాటాలను.. ప్రజాభిమానం పొందిన వైనాన్ని వివరించబోతున్నారు. ఈ బయోగ్రఫీపై సోషల్ మీడియాలో ఆసక్తి ఏర్పడింది. రేవంత్ రెడ్డి ముందు ఇప్పుడు అసలైన టాస్క్ ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. ఆయన ఇమేజ్ ఇప్పుడు ఉన్నదానికన్నా అమాంతం పెరుగుతుంది. ప్రజల్లో తిరుగులేని ఆదరణ పొందుతారు. ఇటీవల  నిర్వహంచిన ఓ పీనియన్ పోల్‌లో కేసీఆర్ ను సీఎంగా చూడాలని 36 శాతం అనుకుంటే.. రేవంత్ రెడ్డికి దాదాపుగా 31 శాతం మంది మద్దతు లభించింది. అధికారంలో ఉన్న సీఎం కంటే ఐదు శాతమే తక్కువ అంటే.. రేవంత్ తన లక్ష్యానికి దగ్గరగా ఉన్నట్లేనని కాంగ్రెస్ పార్టీ వర్గాలు.. రేవంత్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. డిసెంబర్ మూడున ఆయన అనుకున్నది సాధిస్తే..కాంగ్రెస్ విజయం సాధిస్తే.. రేవంత్ .. తెలంగాణలో తిరుగులేని నేత అయిపోతారనడంలో సందేహం లేదు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్