- Advertisement -
ధాన్యాన్ని రైతులు రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలి
Farmers have to register the grain at Rythu Seva Kendras
మండల వ్యవసాయ అధికారి ఎన్. శ్రీనివాసరెడ్డి
పిడుగురాళ్ల,
పిడుగురాళ్ల మండలములోని వీరాపురం, తుమ్మలచెరువు గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమము నిర్వహించి అనంతరం గ్రామసభ నిర్వహించడం జరిగింది అని పిడుగురాళ్ల మండల వ్యవసాయ అధికారి ఎన్. శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, వరి పొలాన్నీ సందర్శించి, పంట కోసే రైతులతో మాట్లాడి, ప్రభుత్వం ధాన్యము కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని తెలియజేసారు. 75 కేజీల బస్తా రూ. 1740/- రూపాయలకి కొనుగోలు చేస్తుందని ధాన్యము ప్రభుత్వం ద్వారా అమ్మదలచిన రైతులు గ్రామాలలోని రైతు సేవా కేంద్రాలలో నమోదు చేయించుకోవాలని తెలియజేసారు. రా గల రెండు రోజుల్లో వతావరణ శాఖ వారు వర్షం చెప్పారు. కావున వరి పంట కోయదలచిన రైతులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు మేరీ మరియు వెంకటేష్ గ్రామ పెద్దలు మరియు రైతులు పాల్గొన్నారు.
- Advertisement -