గ్రీన్ ఫీల్డ్ హైవేకు భూసేకరణ, సర్వేను అడ్డుకున్న రైతులు
Farmers obstructed land acquisition and survey for Greenfield Highway
– రావిర్యాల నుంచి ఆకుతోటపల్లి వరకు రోడ్డు నిర్మాణం
– రంగారెడ్డి జిల్లా కడ్తాల్, కందుకూరు, ఆమనగల్లు మండలాల్లో మార్కింగ్ లు షురూ
– రెవెన్యూ, పోలీస్ శాఖల పరివేక్షణలో మార్కింగ్ పనులు
– కడ్తాల్ మండలం ఎక్వాయిపల్లిలో సర్వేను అడ్డుకున్న రైతులు
– రెవెన్యూ అధికారులను నిలదీసిన రైతులు
స
మాచారం ఇవ్వకుండా రోడ్డు సర్వే ఎలా చేస్తారని రైతుల మండిపాట
గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణ మార్కింగ్ పనులు రంగారెడ్డి జిల్లా కడ్తాల్, ఆమనగల్లు మండలాల్లో ప్రారంభమయ్యాయి. రావిర్యాల ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఫోర్త్ సిటీని కలుపుతూ నిర్మించే గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రహదారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల భూ సేకరణ నోటిఫికేషన్ విడుదల చేసింది. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, యాచారం మండలం కుర్మిద్ద, కడ్తాల మండలం కడ్తాల్, ముద్విన్, ఆమనగల్లు మండలం ఆకుతో టపల్లి, ఆమనగల్లు రెవెన్యూ గ్రామాల పరిధిలో 554.34 ఎకరాల భూమి రహదారి సేకరణకు అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఓఆర్ఆర్ నుంచి ఆమనగల్లు వద్ద నిర్మించ తలపెట్టిన ఆర్ఆర్ఆర్ వరకు నిర్మించే గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి ఇప్పటికే మొదటి విడత ఇబ్రహీంపట్నం మండలం ఫిరోజ్జ్గూడ, కొంగరకలాన్, మహేశ్వరం మండలం కొంగరకుర్దు, కందుకూరు మండలం లేమూరు, తిమ్మాపూర్, రాచులూరు, గుమ్మడవెల్లి, పంజాగూడ, మీర్ ఖాన్ పేట గ్రామాల పరిధిలో భూసేకరణ, మార్కింగ్ పూర్తి చేశారు. రెండో విడతలో భాగంగా ఆమనగల్లు,కడ్తాల్ మండలాల్లో చేపట్టే గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణానికి ఆకుతోటపల్లి నుంచి మార్కింగ్, భూసే కరణ ప్రారంభించారు. రావిర్యాల నుంచి ఆకుతోటపల్లి 41.5కిలోమీటర్లు, 330అడుగుల రోడ్డు నిర్మాణం ఆర్వీ లెట్ సంస్థ ఆధ్వర్యంలో భూసేకణ సర్వే చేపడుతున్నారు. గ్రామాలలో సర్వే చేపడుతుండడంతో పలువురు రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఏళ్ల కాలంగా సాగు చేసుకుంటున్న భూముల్లో నుంచి రోడ్డు ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నస్తున్నారు. ఎక్వాయిపల్లి గ్రామంలో రోడ్డు సర్వేను రైతులు అడ్డుకున్నారు. రైతులకు మద్దతుగా కడ్తాల్ మాజీ జడ్పిటీసి దశరథ్ నాయక్, రైతు సంఘము నాయకుడు వీరయ్య మద్దతు తెలిపారు. అడ్డుకున్న రైతులతో రెవెన్యూ అధికారులు, పోలీసులు నచ్చజెప్పే ప్రయంత్నం చేసిన రైతులు రోడ్డు సర్వేను జరగనిచ్చేది లేదని చెప్పారు.