- Advertisement -
రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద రైతులు ధర్నా….
Farmers strike at Ranko Cement Factory
కొలిమిగుండ్ల,
కొలిమిగుండ్ల మండలంలోని కలవటాల గ్రామం వద్ద ఉన్న రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట కలవటాల నందిపాడు గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున చేరుకొని తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం నాడు ధర్నా నిర్వహించారు. పంట పొలాలపై రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ నుండి దుమ్ము ధూళి పడి పంటలు పండటం లేదని ఇంకా రైతుల సమస్యలను రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఎన్నిసార్లు విన్నవించుకున్న వారు పట్టించుకోవడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా చేస్తున్న రైతుల వద్దకు కొలిమిగుండ్ల సీఐ రమేష్ బాబు సిబ్బందితో వచ్చి రైతులను అక్కడి నుండి పంపించారు. తమ సమస్యలను ఫ్యాక్టరీ యాజమాన్యం పరిష్కరించాలని లేనిపక్షంలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు ప్రతాపరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నారాపురెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, మల్లికార్జున్రెడ్డి, ఇంకా తదితర రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -