కొలిమిగుండ్ల,
కొలిమిగుండ్ల మండలంలోని కలవటాల గ్రామ సమీపంలో ఉన్న రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద రైతులు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నా చేపట్టారు. కొలిమిగుండ్ల గ్రామానికి చెందిన రైతులు సాగు చేసుకుంటున్నా పొలాలపై రాంకో
సిమెంట్ ఫ్యాక్టరీ వారు మైనింగ్ రాయిని పొలాల మధ్యన మట్టి రోడ్డులో వెలుతుండడం వలన సాగు చేసుకుంటున్న పొలాలపై దుమ్ము పడటంతో పంటలు దిగుబడి రాక తీవ్రంగా నష్టపోతున్నామని ఇప్పటికే ఎకరాకు 25
టన్నుల చీని పంట రావాల్సి ఉండగా దిగుబడి చానా తగ్గిపోయి నష్టపోయామని రాంకో యాజమాన్యం వారు తమకు వెంటనే పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఫ్యాక్టరీలోకి వెళ్తున్న లారీలను అడ్డుకొని
రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ వారు వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని లేని పక్షంలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు సోమవారం నాడు తెలిపారు.