- Advertisement -
మేడ్చల్ ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం.
Fatal road accident on Medchal ORR.
మేడ్చల్
మేడ్చల్ ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొన్న ఘటనలో ఒకరి మృతి చెందారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున కారు దుండిగల్ వైపు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న సంగమేశ్వర్ (25) ఘటన స్థలంలోనే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకునే దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -