Sunday, September 8, 2024

 కొడుకుల కోసం తండ్రులు తహతహ

- Advertisement -

 కొడుకుల కోసం తండ్రులు తహతహ
నల్గోండ, డిసెంబర్ 22,
దీపం ఉండగానే ఇంటిని చక్క పెట్టు కోవాలనే నానుడిని నల్లగొండ జిల్లా రాజకీయ నేతలు నిజం చేస్తున్నారు. తనయులను వచ్చే ఎన్నికల్లో ఎంపీలుగా అరంగ్రేటం చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ముఖ్య నేతలు సిద్ధమయ్యారు. తనయుల పొలిటికల్ ఎంట్రీకి ఆ నేతలు తంటాలు పడుతున్నారు. రాజకీయాల్లో తల పండిన ఈ నేతలు.. కొడుకులను రాజకీయ నేతలుగా తీర్చిదిద్దే పనిలోపడ్డారు. పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ఈ పొలిటికల్ దిగ్గజాలు వ్యూహ రచన చేస్తున్నారు.రాష్ట్ర రాజకీయాల్లో దిగ్గజ నాయకుడు.. తల పండిన నేత. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రంలోనే అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన ఘనాపాటి. ఆ నేత మరో తనయుడి పొలిటికల్ ఎంట్రీకి తహాతహాలాడుతున్నాడు. ఆయన ఎవరో కాదు సీఎల్పీ మాజీ నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి. వయో భారంతో పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకున్న జానారెడ్డి.. తన చిన్న కొడుకు జైవీర్ రెడ్డిని అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్ నుంచి పోటీ చేయించి ఎమ్మెల్యేగా చేశాడు. మరో తనయుడు రఘువీర్ రెడ్డిని అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడలో పొలిటికల్ ఎంట్రీకి ప్రయత్నం చేసినe సాధ్యం కాలేదు. ఇద్దరి కొడుకులకు టికెట్ ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం అంగీకరించ లేదు. ఇపుడు రఘువీర్ రాజకీయ భవిష్యత్తు కోసం జానారెడ్డి స్కెచ్ లు వేస్తున్నాడు.ఇందులో భాగంగానే నల్లగొండ లోక్‌ సభ స్థానంపై సీనియర్ నేత జానారెడ్డి కన్నేశాడు. అవసరమైతే తాను నల్లగొండ ఎంపీగా పోటీ చేస్తానని జానారెడ్డి ప్రకటించారు. తనయుడు రఘువీర్ రెడ్డి కోసం సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న సంబంధాలతో ఎంపీ టికెట్ సాధించాలని ప్లాన్ చేస్తున్నాడు. నల్గొండ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ మధ్యనే పోటీ జరిగినప్పటికీ ఎక్కువ సార్లు కాంగ్రెస్ గెలిచింది. ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు పట్టుంది. రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలిచింది. నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నల్లగొండ పార్లమెంటు పరిధిలోని ఏడు స్థానాల్లో ఆరింటిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక్కడి నుంచి తనయుడు రఘువీర్ రెడ్డిని బరిలోకి దించితే విజయం ఖాయమని.. రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసినట్టుగా ఉంటుందని జానారెడ్డి భావిస్తున్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరో సీనియర్ నేత, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ కి రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే తన తాత గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ పేరుతో నల్గొండ, మునుగోడు నియోజక వర్గాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిన్నటి శాసనసభ ఎన్నికల్లో తనయుడీ పొలిటికల్ ఎంట్రీకి గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నల్లగొండ, మునుగోడు నుంచి టికెట్ కోసం ప్రయత్నించినా దక్కలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకొండ బీఆర్ఎస్ ఇన్‌చార్జీగా అమిత్ వ్యవహరించాడు.అయితే పార్లమెంట్ ఎన్నికల్లోనైనా తనయుడు పొలిటికల్ ఎంట్రీకి గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం తనయుడు అమిత్ రెడ్డికి నల్లగొండ బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నాడు. బీఆర్ఎస్ అధినేత కూడా అమిత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నల్లగొండ ఎంపీ స్థానం నుంచి బీఆర్ఎస్ ఖాతా తెరవలేదు. కానీ నల్లగొండ ఎంపీ స్థానం నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి గతంలో మూడుసార్లు ఎంపీగా గెలిచారు. నల్లగొండ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజక వర్గాల్లో గుత్తాకు అనుచర వర్గం ఉంది. నల్లగొండ పార్లమెంటు నియోజక వర్గంలో తనకు ఉన్న సత్సంబంధాలు అమిత్‌కు కలిసి వస్తాయని గుత్తా సుఖేందర్ రెడ్డి భావిస్తున్నారు.మొత్తానికి వారసుల పొలిటికల్ ఎంట్రీ కోసం తలపండిన తండ్రులు తంటాలు పడుతున్నారు. వయోభారం మీద పడుతున్న నేపథ్యంలో ఈ రాజకీయ దిగ్గజాలకు కొడుకుల రాజకీయ భవితవ్యంపై బెంగ పెట్టుకున్నారు. కాలం కలిసి వచ్చి పార్లమెంటులో తనయులు అడుగు పెట్టాలన్న వీరి కోరిక నెరవేతుందో లేదో వేచి చూడాలి..!

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్