Thursday, December 12, 2024

ఐటీ దాడులకు భయపడం:  రేవంత్ రెడ్డి

- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయంపై ఐ.టి దాడుల విషయంలో టీపీసీసీ ఛీఫ్  రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఐ.టి దాడులకు కాంగ్రెస్ భయపడేది లేదు. పాలేరు అభ్యర్థిపై ఐ.టి అధికారులు పెద్దఎత్తున దాడులు చేస్తూ భయపెట్టాలని చూస్తున్నారు. ఇది బిఆర్ఎస్, బీజేపీ కలిసి చేస్తున్న రాజకీయ కుట్ర. ..ఇలాంటి రాజకీయ బెదిరింపులకు కాంగ్రెస్ నాయకులు భయపడరు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి రాష్ట్ర కాంగ్రెస్ అంత అండగా ఉంటుంది. ఓటమి భయంతోనే బిఆర్ఎస్, బీజేపీ కలిసి చేస్తున్న కుట్ర రాజకీయాలు. ఒక్క కాంగ్రెస్ నాయకులను ఐ.టి టార్గెట్గా చేసుకొని దాడులు చేస్తుందని ఆరోపించారు.
గత వారం రోజుల నుంచి కాంగ్రెస్ నాయకుల ఇళ్లల్లో మాత్రమే ఐ.టి దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తోంది. బిఆర్ఎస్, బీజేపీ కలిసి చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలు అన్ని గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఈ రెండు పార్టీ లకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్