- Advertisement -
ఫీజ్ రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి
Fee reimbursement should be released immediately
ఉప్పల్
గత బిఅర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో నిరుద్యోగులే కీలక పాత్ర పోషించారు. ఇప్పుడున్న రేవంత్ సర్కార్ కూడా అదే తరహా లో పాలన కొనసాగిస్తుంది అని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అఖిల్ మండిపడ్డారు. ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో అఖిల్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని, సాంఘిక హాస్టల్స్ కు సొంత భవనాలు కేటాయించి, మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని, పర్మినెంట్ వార్డెన్లను నియమించాలని డిమాండ్ చేశారు. విద్యను ప్రైవేటీకరణ చేసే విధంగా కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తే మాత్రం అఖిల భారతి విద్యార్థి పరిషత్ సహించదన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయని పక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉప్పల్ కేంద్రంగా విద్యార్థులతో మరో మలిదశ ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.
- Advertisement -