- Advertisement -
రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై మృతి
Female SI dies in road accident
ఘటనలో మరోకరు కుడా మృతి
జగిత్యాల
రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్ ఐ శ్వేతతో పాటు మరొకరు మృతి చెందారు. గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ వద్ద ఘటన చోటు చేసుకుంది. బైక్ ను తప్పించబోయి కారు చెట్టుకు ఢీ కొట్టింది. కారు డ్రైవింగ్ చేస్తున్న ఎస్ శ్వేత, బైకు మీదున్న వ్యక్తి మృతి అక్కడికక్కడే మృతి చెందారు. గతంలో వెల్గటూర్ లో ఎస్ ఐ గా విధులు నిర్వహించిన శ్వేత, ఇప్పుడు డీసీఆర్బీలో పనిచేస్తున్నట్లు సమాచారం. కోరుట్లలో కుడా ఎస్సైగా విధులు నిర్వహించింది. ఆర్నకొండ నుంచి జగిత్యాల కి వెళ్లే క్రమంలో ప్రమాదం జరిగింది.
- Advertisement -