- Advertisement -
యాభై లక్షల హవాలా నగదు స్వాధీనం
రంగారెడ్డి
రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా తరలిస్తున్న హవాలా డబ్బును పోలీసులు పట్టుకున్నారు. ఇన్నోవా క్రిస్టా కార్ లో తరలిస్తున్న 50 లక్షల హవాలా డబ్బు ను మాదాపూర్ ఎస్ఓటి పోలీసులుపట్టుకున్నారు. బుధవారం రాత్రి 12:30 గంటల సమయంలో డబ్బు తరలిస్తున్న విక్రమ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు విక్రం ఎలాంటి పత్రాలు లేకుండా డబ్బులను మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు గుర్తించారు. డబ్బుల గురించి అడగగా రియల్ ఎస్టేట్ డబ్బులు అని ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు. దొరికిన 50 లక్షల రూపాయలను ఐటి డిపార్ట్మెంట్ కి అప్పగిస్తామని రాయదుర్గం పోలీసులు వెల్లడించారు. .
- Advertisement -