సిద్దిపేట జిల్లా:నవంబర్ 03
తెలంగాణలో ఎన్నికలు మరింత వేడెక్కనున్నాయి నామినేషన్ ప్రక్రియ మొదలు కావడంతో అభ్యర్థుల్లో మరింత జోష్ పుట్టిస్తుంది, దీనిలో భాగంగా..
గత ఎన్నికలలో కేసీఆర్ సొంత నియోజవర్గం గజ్వేల్ లో ఆయనకు పోటే లేదు కెసిఆర్ ఫాంహౌజ్ కూడా ఇక్కడే ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి ఇక్కడే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అయితే మొదటి రోజు శుక్రవారం గజ్వేల్ లో ఆసక్తికర సంఘటన నెలకొంది,సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తమిళనాడు రాష్ట్రం నుంచి సేలం వాసి పద్మరాజన్(66) ఏళ్ల వయస్సులోనూ శుక్రవారం ఉదయం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
ఈయనను ఎలక్షన్స్ కింగ్ అని పిలుస్తారు. ఈ సందర్భంగా పద్మరాజన్ మాట్లాడుతూ..ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన ఎమ్మెల్యే ఎన్నికల్లో 236 నామినేషన్లు వేయడం జరిగిందని ఈరోజు గజ్వేల్ ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ పై పోటీ చేయడానికి 237 వ నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగిందని అన్నారు.
గజ్వేల్‌లో ఇప్పటికే బీఆర్ఎస్ నుండి సీఎం కేసీఆర్, బీజేపీ నుండి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుండి నర్సారెడ్డిలు బరిలో ఉన్నారు…