- Advertisement -
నిరుపేద యువతి వివాహనికి రూ.10 వేల ఆర్థిక సాయం
Financial assistance of Rs. 10 thousand for the marriage of a poor young woman
రామగుండం
రామగుండం నియోజకవర్గం 28వ డివిజన్ వినోబానగర్ కు చెందిన నిరుపేద క్రిస్టియన్ యువతి వివాహానికి వీహెచ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. వివాహం సందర్భంగా స్థానిక డివిజన్ బిఆర్ఎస్ పార్టీ
నాయకులు, ఫౌండేషన్ ఫౌండర్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డినీ సాయం అందించాల్సిందిగా అభ్యర్థించారు. వెంటనే స్పందించిన హరీష్ రెడ్డి ఆ మహిళ వివాహానికి ఆర్థిక సాయం వెంటనే అందించాల్సిందిగా వీహెచ్ఆర్ టీం సభ్యులకు సూచించారు. అయన సూచన మేరకు ఆదివారం వినోబా నగర్ లోని యువతి నివాసంలో వారి కుటుంబ సభ్యులకు రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని టీం సభ్యులు, స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా యువతి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అడిగిన వెంటనే స్పందించి, మా కుటుంబ పరిస్థితిని చూసి మంచి మనసుతో సాయాన్ని అందించిన వీహెచ్ఆర్ ఫౌండేషన్ కి, ఫౌండర్ హరీష్ రెడ్డికి, ఫౌండేషన్ సభ్యులకు, స్థానిక 28 డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 28వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, వివిధ డివిజన్ల ఫౌండేషన్ సభ్యులు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -