హోటల్ ఎస్ వి ఏం లో అగ్ని ప్రమాదం..!
భారీ ఎత్తున చెలరేగిన మంటలు..!
మంటలు అర్పుతు వివరాలు.. సేకరిస్తున్న అగ్నిమాపక సిబ్బంది ..!
ఫోటో రైటప్ 23: మేడిపల్లి 23 : మేడిపల్లి ఎస్ వి ఏం హోటల్ లో అగ్ని ప్రమాదం దృశ్యం.
వాయిస్ టుడే న్యూస్, ఏప్రిల్ 23 మేడిపల్లి :
మేడిపల్లి మండలం పీర్జాదిగూడ ఎస్ వి ఏం హోటల్ లో అగ్ని ప్రమాదం సంబవించింది,వివరాలు ఇలా ఉన్నాయి.. మేడిపల్లి మండలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల ఎస్ వి ఏం హోటల్ వెనుక భాగం సెకండ్ ఫ్లోర్ కిచెన్ లో ఒక్క సారిగా మంటలు చెలరేగడం తొ సిబ్బంది, అప్రమత్తం అయ్యి మంటలను అదుపు చేసారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణం తెలియవలసి ఉంది.ఏవిధమైన ప్రాణ నష్టం జరగలేదు.. హోటల్ లో మొత్తం కరెంట్ బంద్ చేసి వివరాలు సేకరిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడం తొ చుట్టూ పక్కల వారు భయాందోళనకు గురి అయ్యారు.ఈ హోటల్ లో ప్రముఖులు బస
చేస్తూ ఉంటుంటారు. ఫంక్షన్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. పెద్ద ఎత్తున ప్రమాదం జరగక పోవడం తొ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.