ఫిష్ మార్కెట్ ను సరైన హంగులతో నిర్మాణం చేపట్టాలి
Fish market should be constructed with proper attitude
-ఐటీ మంత్రి శ్రీధర్ బాబుకు వినతి పత్రం అందజేసిన మత్స్య సహకార సంఘం నాయకులు
మంథని
మంథని పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసే నాన్ వెజ్ మార్కెట్లో ఫిష్ మార్కెట్ ను సరైన హంగులతో నిర్మాణం చేపట్టాలని మంథని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు పోతరవేని క్రాంతి కుమార్,ఇతర
మత్స్య సహకార సంఘం నాయకులు రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు మంగళవారం వినతిపత్రం సమర్పించారు.
మంథని మున్సిపల్ అభివృద్ధిలో భాగంగా నూతన నాన్
వెజ్ మార్కెట్ ను ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టినటువంటి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ లో మత్స్యకారుల కొరకు ఫిష్ మార్కెట్
కలిగి ఉన్నందున కొంత మంది మత్స్య కారులు ఉపాథి పొందుతున్నారని,ఇప్పుడు ఏర్పాటు చేయబోయే నూతన నాన్ వెజ్ మార్కెట్ లో తిరిగి ఫిష్ బిల్డింగ్ ఏర్పాటు చేసి మార్కెట్లో మరిన్ని సదుపాయాతో షెటర్స్
పెంపుదల చేయాలని, అలాగే మంథని నుండి వివిధ ప్రాంతాలకు చేపలు ఎగుమతి జరిగే విధంగా ప్రణాళిక బద్దంగా ఆలోచన చేయాలని మత్స్యకారులందరి తరపున మంథని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం
అధ్యక్షులు పోతరవేని క్రాంతి కుమార్ కోరారు.
దీనికి మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించి అనుకున్న దానికి పదింతలు ఎక్కువగా మత్యకారులకు అభివృద్ధి ఉంటుందని హామీ ఇచ్చారు. బోయిన్ పేట్ బ్రిడ్జి కట్ట
నుండి లక్ష్మీ దేవర టెంపుల్ కట్ట వరకు చెడిపోయిన రోడ్డును పునరుద్ధరించాలని అడగడంతోనే మున్సిపాలిటీ యంత్రాంగానికి వెంటనే దిశానిర్దేశం చేసి త్వరితగతన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి
ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు కు మత్స్యకారుల అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం నాయకులు పోతరవేని అర్జున్, సబ్బని సమ్మయ్య,
నరెడ్ల కిరణ్, గుండా సాగర్, సిలివేరి భూమయ్య, డిష్ రాజు, జడిగల లక్ష్మణ్ మత్స్య సహకార సంఘం సభ్యులు పాల్గొన్నారు.