వరద బాధితులను ఆదుకోవాలి!
Flood victims should be supported!
మల్లు. కోదాడ/నడిగూడెం,
సెప్టెంబర్ 3. (వాయిస్ టుడే ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలకు,వరదలకు పంట నష్టపోయిన రైతాంగాన్ని, వరద బాధితులను, పరిహారమిచ్చి, ఆదుకోవాలని సిపిఎం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. భారీ వర్షాలకు వరి ,పత్తి ,కంది పండ్ల తోటల రైతులు తీవ్రంగా నష్టపోయినందున, నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. మంగళవారం,నడిగూడెం మండల కేంద్రంలో ఉన్న సుందరయ్య భవన్లో జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు , సిపిఎం జిల్లా నాయకులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు ,మాజీ వైస్ ఎంపీపీ కొరట్ల శ్రీనివాస్, బృందావనపురం మాజీ సర్పంచ్ బెల్లంకొండ హనుమయ్య, ,సింగల్ విండో డైరెక్టర్ బీరవెల్లి సుధాకర్ రెడ్డి, మైనార్టీ నాయకులు లతీఫ్ బాబు, ముసుగు వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు