- Advertisement -
పిల్లల ఆరోగ్యంపై దృష్టి సారించాలి
Focus on children's health
హైదరాబాద్
పిల్లల అలవాట్లు, ఆరోగ్యంపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా అన్నారు. సీసా స్పేస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘మొబైల్ ఫోన్, ట్యాబ్, ఐపాడ్లకు పిల్లలు అతుక్కుపోతున్నారు. అన్నం తినే సమయంలోనూ చేతిలో డివైస్ లేకపోతే ముద్ద దిగడంలేదు. ఒక తల్లిగా నేనూ బాధితురాలినే.. పిల్లలకు ఆరోగ్యం, ప్రశాంతమైన వాతావరణంలో చదువు అనేది ముఖ్యం. అందుకు స్పేస్లో భాగస్వామిని కావాలని నిర్ణయించుకున్నాను’ అని ఆమె పేర్కొన్నారు. చిన్నారులకు సరైన దిశానిర్దేశం చేసి నపుడే అద్భుతమైన భవిష్యత్తును అందుకుంటారన్నారు. ఆటలు, ఆరోగ్యం కోసం కుటుంబ సభ్యులతో వచ్చి ఉండేలా ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయని సీసా స్పేస్ కో-ఫౌండర్ కొణిదెల శ్రీజ పేర్కొన్నారు. స్వాతి గునుపాటి ఏడాది వయసున్న పిల్లల నుంచి టీనేజర్ల వరకూ అవకాశం కల్పిస్తు న్నామన్నారు.
- Advertisement -