Sunday, September 8, 2024

కెనడా,  భారత్ విదేశాంగ అధికారుల భేటీ

- Advertisement -
Foreign officials of Canada and India meet
Foreign officials of Canada and India meet

న్యూఢిల్లీ, అక్టోబరు 11: భారత్,కెనడా మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్, కెనడా విదేశాంగ మంత్రి మెలనీ జాలీ రహస్యంగా భేటీ అయినట్టు సమాచారం. కొన్ని రోజుల క్రితమే వీళ్లిద్దరూ వాషింగ్టన్‌లో సమావేశమైనట్టు కొన్ని నివేదికలు వెల్లడించాయి. బ్రిటీష్ న్యూస్‌పేపర్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. అయితే…ఈ రహస్య సమావేశంపై ఇటు భారత్ కానీ అటు కెనడా కానీ స్పందించలేదు. ఆ రిపోర్ట్‌లు చెప్పిన దాన్ని బట్టి చూస్తే…భారత్‌తో వివాదాన్ని పక్కన పెట్టి ఉద్రిక్తతలు తగ్గించేందుకు కెనడా సిద్ధంగానే ఉన్నట్టు తెలుస్తోంది. భారత్‌లోని కెనడా దౌత్యవేత్తలు వెనక్కి వెళ్లిపోవాలని ఇప్పటికే ఇండియా వార్నింగ్ ఇచ్చింది. లేదంటే ద్వైపాక్షిక బంధాలు దెబ్బ తినే ప్రమాదముందని హెచ్చరించింది. ఈ మేరకు కెనడా తమ దౌత్యవేత్తల్ని వెనక్కి రప్పిస్తోంది. భారత్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని ఇప్పటికే కెనడా ప్రకటించింది. కానీ…ఇప్పటి వరకూ పరిస్థితులు అదుపులోకి రాలేదు. పైగా అమెరికా కూడా ఇందులో జోక్యం చేసుకోవడం సంక్లిష్టంగా మారింది. కెనడా చేస్తున్న ఆరోపణల్ని పరిగణనలోకి తీసుకుని విచారణకు సహకరించాలని భారత్‌కి అగ్రరాజ్యం సలహాలిచ్చింది. ఈ వ్యాఖ్యలూ కాస్త దుమారం రేపాయి. కెనడా వివాదం కారణంగా భారత్, అమెరికా మధ్య మైత్రి కూడా చెడిపోతుందన్న వాదనలు వినిపించాయి. ఈ విషయంలో ఎవరి అభిప్రాయం వారిదే అయినా…మొత్తంగా అయితే…ఎంతో కొంత ప్రభావం పడుతుందని ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు. కెనడాలోని CTV News రిపోర్ట్‌ల ప్రకారం..భారత్‌లోని 30 మంది దౌత్యవేత్తల్ని సింగపూర్‌లోని కౌలాలంపూర్‌కి తరలించారు. భారత్‌, కెనడా దేశాల మధ్య దౌత్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. యనైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ అధ్యక్షుడు జాయెద్‌తో తాను భారత్‌ అంశం, చట్టాన్ని గౌరవించడం, సమర్థించడం ప్రాముఖ్యత గురించి మాట్లాడానంటూ స్వయంగా ట్రూడోనే సోషల్‌ మీడియా ఖాతా ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో ఆయన చర్య ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెంచే విధంగా ఉన్నాయి. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ జస్టిట్‌ ట్రూడో భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను దిల్లీ ఖండిస్తోంది. కాగా కెనడా మాత్రం తన వాదన నుంచి వెనక్కి తగ్గడం లేదు. ఓ పక్క భారత్‌తో సంబంధాలు తమకు ముఖ్యం అని చెప్తూనే మరోవైపు రెచ్చగొట్టే పనులు చేస్తోంది.కెనడా చేస్తున్న ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండిస్తోంది. కాగా భారత్‌ కూడా కెనడాపై ఆరోపణలు చేస్తోంది. భారత వ్యతిరేక శక్తులకు కెనడా ఆశ్రయమిస్తోందని, ఇది ఇరు దేశాలకు మంచిది కాదని తెలిపింది. ఖలిస్థానీ తీవ్రవాదులు తమ కార్యకలాపాలను కెనడా నుంచి సాగిస్తున్నారని ఆరోపిస్తోంది. భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ కూడా కెనడా వాదనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆధారాలుంటే భారత్‌ తప్పకుండా దర్యాప్తుకు సహకరిస్తుందని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్