ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు…

- Advertisement -

ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు…

Former Prime Minister Indira Gandhi's birth anniversary

మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇంగిలే రామారావు…

జమ్మికుంట

భారతదేశ మాజీ  తొలి మహిళా ప్రధాని భారతరత్న ఇందిరా గాంధీ  107 వ, జయంతి కార్యక్రమాన్ని హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వోడితల ప్రణవ్ బాబు, ఆదేశాల మేరకు ఇల్లంతకుంట మండలంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇంగిలే రామారావు, ఇందిరాగాంధీ  చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామారావు, మాట్లాడుతూ పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఉక్కు మహిళ వీర వనిత గరీబ్ హటావో నినాదంతో  పేదరికాన్ని తొలగించి దేశాన్ని రక్షించండి అనే నినాదంతో పిలుపునిచ్చి అన్ని రంగాల అభ్యున్నతికి కృషి చేశారు అని అన్నారు. ఇందిరమ్మ ఇప్పటికీ పేదల సంక్షేమ సిద్ధాంతం ఆమెనే స్ఫూర్తిదాయకం బ్యాంకుల జాతీయకరణ భూ సంస్కరణలు తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారన్నారు.ఈ కార్యక్రమంలో  ఇల్లంతకుంట మండలం లోని 18 గ్రామాల సీనియర్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ ఎస్ యు ఐ నాయకులు తదితరులు  పాల్గొన్నారు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular