మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు
Former Prime Minister Manmohan Singh's death is a great loss for the country
ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు..
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా పట్టణంలోని నంది విగ్రహం వద్ద శుక్రవారం రోజున మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మన్మోహన్ సింగ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటనీ,దేశాన్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన మహా ఆర్థిక మేధావి మన్మోహన్ ని,ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థిక శక్తిగా నిలబెట్టిన ఘనత వారికే దక్కుతుందన్నారు.
ఎటువంటి వివాదాలు లేకుండా 10 సంవత్సరాలు ప్రధానిగా పనిచేసి వివాద రహితుడగా పేరు పొందారని,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా సోనియా గాంధీ, అప్పటి పోరాడని మన్మోహన్ సింగ్ సారథ్యం లోనే సాధ్యం కావడం జరిగిందన్నారు.
కేంద్ర మంత్రిగా వారు చేసిన సేవలు దేశం ఎన్నటికీ మార్చిపోదని,సోనియా గాంధీ కి ప్రధానిగా అవకాశం వచ్చినప్పటికి మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా తీసుకు వచ్చిన ఆర్థిక సంస్కరణల దృష్ట్యా ప్రధాని పదవిని వారికి ఇవ్వడం జరిగిందని,వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నట్లు ఈ సంధర్బంగా విప్ తెలిపారు..
వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..