మహాకుంభమేళాలో తప్పిపోయిన జగిత్యాలకు చెందిన నలుగురు మహిళలు క్షేమంగా ఇంటికి చేరిక.
Four women from Jagitya who went missing in Mahakumbha Mela reached home safely.
ఊపిరి పీల్చుకున్న కుటుంబ సభ్యులు
పుణ్య స్నానాల కోసం మహా కుంభమేళాకు వెళ్ళిన జగిత్యాల నిర్మల్ జిల్లాలకు చెందిన నలుగురు మహిళలు తప్పిపోయి క్షేమంగా ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
జగిత్యాలకు విద్యానగర్ కు చెందిన నర్సవ్వ, కొత్తవాడకు చెందిన రాజవ్వ, నిర్మల్ కు చెందిన మరో ఇద్దరు వారి బంధువులు నాలుగు రోజుల క్రితం మహా కుంభమేళాకు వెళ్లారు. భక్తజనసంద్రంగా మారిన మహాకుంభమేళలో నలుగురు మహిళలు తప్పిపోయారు. వెంట వచ్చిన వారు ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు గత 24 గంటలుగా ఆవేదనతో ఆందోళన చెందారు. ఆచూకీ కోసం ఆరా తీశారు. చివరకు తప్పిపోయిన నలుగురు మహిళలు పోలీసుల సహకారం నెల్లూరుకు చెందిన తెలుగు వాడి ఆర్థిక సహాయంతో నలుగురు మహిళలు ట్రైన్ లో వరంగల్ కు చేరుకొని అక్కడి నుంచి స్వస్థలానికి చేరారు. భక్తుల రద్దీతో ట్రాఫిక్ జామ్ కావడంతో తప్పిపోయామని, భాష రాక తెలిసినవారు లేక ఓ ప్రయాణికుడు చెప్పిన సమాచారంతో రైల్వే స్టేషన్ కి వెళ్లి ట్రైన్ ఎక్కి గమ్యానికి చేరామని తెలిపారు.