- Advertisement -
పేదలందరికి ఇళ్లు పేరుతో మోసం.. 3.50 కోట్లు దోపిడీ
Fraud in the name of houses for all the poor.. 3.50 crores robbery
భూ సమస్యలు, సాగునీటి సమస్యలపై పలువురు వినతి
అర్జీలు స్వీకరించిన మంత్రి నిమ్మల రామానాయుడు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్
తాడేపల్లి
గత వైసీపీ ప్రభుత్వంలో నవరత్నాలు పేదలందరికి ఇళ్లు పేరుతో తెనాలి మండలం సంగంజాగర్లమూడిలో దేవస్థానం భూములను నిబంధనలకు విరుద్ధంగా తీసుకొని దేవస్థానంకు చెందాల్సిన రూ. 3.50 కోట్లు కొట్టేశారని దీనివెనుక ఉన్న దోపిడీదారులు వారికి కొమ్ముకాస్తున్న అధికారులపై చర్యలు తీసుకొని దేవాలయాల భూములను కాపాడాలని బీజేపీ నాయకుడు వై. కామేశ్వరరావు నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ లకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశాడు. • ప్రకాశం జిల్లా సీపీ పల్లె మండలం కమ్మవారిపల్లె గ్రామానికి చెందిన వేమూరి సుబ్బారావు విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలోని చెరువు ఆనకట్ట, తూములు పూర్తిగా పాడైయ్యాయని అంతే కాకుండా ప్రధాన కాలువ పూడిపోవడంతో చెరువులోకి రావాల్సిన నీరు రావడంలేదని దయ చేసి ఇరిగేషన్ అధికారులు తమ చెరువుపై దృష్టి పెట్టి బాగు చేయాలని విజ్ఞప్తి చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలానికి చెందిన డి. సూర్య ప్రకాశ్ విజ్ఞప్తి చేస్తూ.. తమ భూమికి పట్టాధారు పాస్ పుస్తకాలు ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని దయ చేసి తన భూ సమస్యను పరిష్కరించాలని వేడుకున్నాడు.
తన తల్లికి 92 సంవత్సరాలని.. గత ప్రభుత్వంలో కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని పింఛన్ ను కట్ చేశారని.. దయ చేసి తన తల్లికి పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని విజయవా పాయకాపురానికి చెందిన ఎన్. సుబ్బలక్ష్మీ విజ్ఞప్తి చేశారు.
• ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో తాము CLRPలుగా పనిచేస్తూ.. తమ ఉద్యోగాలు రెన్యువల్ కోసం ఇటీవల టీడీపీ కేంద్ర కార్యాలయంలో అర్జీ పెట్టుకోగా తమ సమస్య పరిష్కరించడిందని.. పెట్టిన అర్జీకి స్పందించిన తమకు మేలు చేసిన ప్రభుత్వానికి రుణపడి ఉంటామని అర్జీ దారు పద్మతో పాటు పలువురు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వెంటనే స్పందించి తమ పనిని వేగంగా పూర్తి చేసిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
• నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురం గ్రామానికి చెందిన గొడుగులూరి మాలకొండ రాముడు విజ్ఞప్తి చేస్తూ.. మండలంలోని మెట్ట ప్రాంత ప్రజలకు సాగు, తాగునీటికి ఆధారంగా ఉన్న నక్కల గండి రిజర్వాయర్ కు నీరు వచ్చేలా కాలువ పూడిక తీత, లైనింగ్ పనులకు నిధులు మంజూరు చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడికి విజ్ఞప్తి చేశారు.
• రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ ఎచ్ ఎంలో 4వ తరగతి ఉద్యోగులుగా వివిధ రకాల క్యాడర్లలో అనేక సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నామని.. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని గత సీఎం మోసం చేశారని.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులర్ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
- Advertisement -