ఉచితంగానే ఇసుక సరఫరా

- Advertisement -

ఉచితంగానే ఇసుక సరఫరా

Free supply of sand

విశాఖపట్నం
రాష్ట్ర ప్రభుత్వ విధానా లకు, ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలోని ప్రజలకు ఉచితంగానే ఇసుక సరఫరా చేస్తున్నామని, రవాణా, ఆపరేషనల్ ఛార్జెస్ తప్ప ఎలాంటి రుసుము విధించటం లేద ని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ స్పష్టం చేశారు. పాలసీకి విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా, అక్రమా లకు, అవకతవకలకు ఎవరు పాల్ప డినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా ప్రజల అవసరాల మేరకు రోజువారీ డిమాండ్ కు అనుగుణంగా 3,000 టన్నుల ఇసుకను పక్క జిల్లాల నుంచి తెప్పించేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఉచిత ఇసుక విధానం, ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియ, రీచ్ లు ఇతర అంశాలపై కలెక్టరేట్ వీసీ హాలులో పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి, జాయిం ట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు.సెప్టెంబర్ 20 నుంచి అన్ని సచివాలయాలు, ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఇసుక ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చామని తద్వారా ఇప్పటి వరకు 442 బుకింగ్ లు జరగ్గా.. 357 బుకింగులకు 7,000 టన్నుల ఇసుక సరఫరా చేశామని వివరించారు. బల్క్ ఆర్డర్లు 103 జరగ్గా సాంకేతిక కారణాలతో ఇవ్వలేదని.. వారందరికీ రెండు, మూడు రోజుల్లో ఇసుక సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. జిల్లాలో డిమాండ్ మేరకు ఇసుక అందజేసేందుకు చర్యలు తీసుకున్నామని.. ఈస్ట్ గోదావరి, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను అనుసం ధానం చేశామని వెల్లడించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular