Friday, November 22, 2024

సన్నాలకు ఫుల్ గిరాకీ

- Advertisement -

సన్నాలకు ఫుల్ గిరాకీ

Full demand for Sanna

నిజామాబాద్, సెప్టెంబర్ 17, (వాయిస్ టుడే)
వ్యవసాయ ఈసారి వరి సాగు రైతుల పాలిట సి రులు కురిపించబోతోంది.. రాష్ట్రంలో సన్నరకం వరిధాన్యానికి డిమాండ్ పెరుగుతూ వస్తోంది. వ్యాపారులు వరికోతలకు ముందుగానే రైతులకు కొంతమొత్తం నగదు అ డ్వాన్సుగా చెల్లించి తామే ధాన్యం కొనుగోలు చేస్తామని ఒ ప్పందాలు కుదుర్చుకుంటున్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయరంగం పట్లు తీసుకున్న సానుకూల నిర్ణయాలు రైతులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చుతున్నాయి. సన్నరకం వరిసాగు విస్తీర్ణతను పెంచాలన్న లక్షంతో ప్ర భుత్వం రైతులకు బోనస్ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో రైతులు ఈ సారి దొడ్డు రకం ధాన్యం స్థానంలో పెద్ద ఎత్తు న సన్నరకం ధాన్యం పండించేందుకు మొగ్గు చూపారు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ కింద 57లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరిసాగు చేయించాలని ప్రభుత్వం ప్రాథమిక లక్ష్యాలను నిర్దేశించుకుంది. అయితే వరినాట్ల సీజన్ ముగింపు ధశకు చేరకుంది. ఇప్పటికే వరినాట్లు 59లక్షల ఎకరాలకు మిం చాయి. ప్రభుత్వ ప్రాథమిక లక్షలో ఇప్పటికే వరిసాగు విస్తీర్ణం 104.52శాతానికి చేరుకుంది. మరో వారం పదిరోజుల్లో వరిసాగు 60లక్షల ఎకరాలకు చేరుకునే అవకాశాలు ఉన్నట్టు వ్యవసాయశాఖ అంచనా వేసింది.రాష్ట్రంలో ఖరీఫ్‌లో సాగు చేసిన వరి ముందస్తుగా నాటు వేసిన ప్రాంతాల్లో అక్టోబర్ చివరి నుంచి వరికోతలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సన్నరకం ధాన్యానికి పెరిగిన డిమాండ్ నేపథ్యంలో ప్రైవేటు వ్యాపారులు వరికోతలకు ముందుగానే మేల్కొంటున్నారు. రైతులతో ధాన్యం కొనుగోళ్లకు అగ్రిమెంట్లు కుదుర్చుకుని అ డ్వాన్సులు చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే కొ న్ని జిల్లాల్లో క్వింటాలు ధాన్యానికి రూ.2600నుంచి రూ. 2800 చొప్పున ధరతో అగ్రిమెంట్లు చేసుకుంటున్నట్టు స మాచారం. వాతావరణ పరిస్థితలను బట్టి ఎకరానికి ఈ సారి 30క్వింటాళ్ల వరకూ దిగుబడి లభించే అవకాశాలు ఉన్నట్టు ముందస్తు అంచానాలు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరమీద రూ.500అదనంగా చెల్లిస్తామని ప్రకటించింది. దీంతో ప్రైవేటు వ్యాపారులు సన్నరకం ధాన్యం కోసం ముందుగానే పోటీలు పడుతున్నారు.రాష్ట్రంలో సాగులోకి వచ్చిన వరిలో 60శాతం మేరకు సన్నరకాలే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం సన్నరకాల ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ధర ప్రకటించటం వరిసాగు రైతుల్లో పెద్ద మార్పునకు బీజం వేసింది. ఈ సారి అధికంగా తెలంగాణ సోన (ఆర్‌ఎన్‌ఆర్15048),వరంగల్ సాంబ, వరంగల్ సన్నాలు, సాంబామసూరి(బిపిటి5204)చ జగిత్యాల ,హెచ్‌ఎంటి ,మార్టూరు సాంబ, ఎంటియు, సోమనాధ్, కరీంనగర్ సాంబ, అజన, ప్రత్యూమ్న, సుంగంధ సాంబ, కేపిఎస్,రాజేంద్రనగర్4, కూరం , సిద్ది, జేజిఎల్, తదితర33రకాల సన్నవరిని రైతులు సాగు చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో ఈ సారి 4.75 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి.నిజామబాద్ జిల్లాలో 4.29లక్షల ఎకరాలు, సూర్యాపేట జిల్లా 3.34లక్షల ఎకరాలు. సిద్దిపేట జిల్లాలో 3.41లోల ఎకరాలు, కామారెడ్డిజిల్లాలో 3.11లక్షల ఎకరాలు, జగిత్యాల జిల్లాలో 3లక్షలు, మెదక్‌లో 2.81లోలు, కరీంనగర్‌లో 2.73లక్షలు సాగులోకి వచ్చాయి. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా గత ఏడాది ఖరీఫ్‌కంటే ఈ సారి ఖరీఫ్‌లో సన్నరకం వరిసాగువైపే రైతులు మొగ్గు చూపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్