బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయించిన నిధులు సరిపడవు
—-పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల విడుదల కి కృషి చేయాలి
—ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్
కరీంనగర్ ఫిబ్రవరి 11(వాయిస్ టుడే)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన ఓటన్ అకౌంట్ బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయించిన నిధులు విద్యార్థి లోకాన్ని సంతృప్తి పరచలేదని ఇంకా విద్యాశాఖ కి నిధులు పెంచి ఆ నిధులు పూర్తిగా విద్యార్థుల సంక్షేమానికి ఉపయోగించాలని నిన్న బడ్జెట్ లో కేవలం 7% నిధులతో 21వేల కోట్లు మాత్రమే విద్యాశాఖ కేటాయించారని ఒక్క ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలే 5500 కోట్లు పెండింగ్ ఉన్నాయని వాటిని విడుదల చేసి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అదే విధంగా యూనివర్సిటీలల్లో మౌలిక సదుపాయాలకు 500 కోట్లు కేటాయించారని ఒక్క శాతవాహన యూనివర్సిటీ కే 100కోట్ల నిధులు కావాలని గురుకుల భవనాలకు సొంత భవనాలతో పాటు సంక్షేమ హాస్టల్స్ కి కూడా సొంత భవనాలు నిర్మించాలని అదేవిధంగా హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీల పెంపుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని విద్యార్థుల సంక్షేమానికి ప్రస్తుత నిధులు సరిపోవని ఇంకా నిధులు పెంచాలని ఎన్నికల్లో ఇచ్చిన హామీ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి కృషి చేయాలని మచ్చ రమేష్ డిమాండ్ చేశారు



