Sunday, September 8, 2024

జి.పి. నిధుల దుర్వినియోగం పై సి.బి.ఐ. విచారణ జరిపించండి

- Advertisement -

జి.పి. నిధుల దుర్వినియోగం పై సి.బి.ఐ. విచారణ జరిపించండి

బాధ్యులందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

జిల్లా కలెక్టర్ ను కోరిన చుక్క గంగారెడ్డి

జగిత్యాల,
జిల్లా లోని బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన భారీ నిధుల దుర్వినియోగంపై సిబిఐ అధికారుల చే విచారణ జరిపించి బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంగళ వారం జగిత్యాల జిల్లా కలెక్టర్ ను చుక్క గంగారెడ్డి కోరారు.
మంగళ వారం ఆయన జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. సర్పంచ్ మూల సుమలత ఆమె భర్త మూల శ్రీనివాస్ గౌడ్ లు ఉద్దేశ్య పూర్వకంగానే భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఇప్పటికే తాను విజిలెన్స్ అధికారులకు పలు పిర్యాదులు చేయడం కూడా జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకు వెళ్తానని ఆయన సూచించారు.
చేయని పనులకు చేసినట్లుగా, పాత పనులకే కొత్త బిల్లులుగా, దొంగ బిల్లులు, దొంగ రికార్డులు సృష్టించారని అన్నారు.
పంచాయతీ కార్యదర్శులు మహబూబ్ పాషా, నరేందర్ లతో పాటు కొందరు వార్డ్ సభ్యులు, కొందరు అధికారులు, ఉన్నతాధికారులు, సిబ్బంది కూడా ఇందుకు సహకరించారని ఆయన ఆరోపించారు. దొంగ రికార్డులు, దొంగ బిల్లులు పెట్టి గ్రామ పంచాయతీకి చెందిన బ్యాంక్ ఖాతాల నుండి అక్రమంగా నిధులు డ్రా చేశారని అన్నారు. చట్టపరంగా, ధర్మంగా, నీతి – నిజాయితీతో న్యాయపోరాటం చేసిన మాపై అనేక కుట్రలు, కుతంత్రాలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని పిర్యాదులు చేసినా ఉన్నతాధికారులు సరైన సమయంలో, సరైన విధంగా విచారణ చేపట్టలేదన్నారు. పాలకులతో కుమ్మక్కై భారీగా ప్రజా ధనం దోపిడీకి పాల్పడ్డారని  ఆరోపించారు. జిల్లా కలెక్టర్, తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ ఆదేశాలను, ఆర్దర్లను కూడా బే ఖాతర్ చేశారని అన్నారు.
ఇప్పటికీ కూడా పాలకులతో కుమ్మక్కై చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని. చట్టాలనే వారి చుట్టాలుగా మార్చుకొని ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నారని, విలువైన అధికారుల విధులను, సమయాన్ని, వారికి ఉన్న అధికారాన్ని కూడా దుర్వినియోగం చేశారని తెలిపారు. విజిలెన్స్ అధికారులకు పిర్యాదులు చేసినా రాజకీయంగా విచారణ నిలిపి వేయించు కొన్నారని అన్నారు.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి సి.ఐ.డి. అధికారులచే సమగ్ర విచారణ జరించి బాద్యులందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, దుర్వినియోగం అయిన ప్రజా ధనం మొత్తం తగు వడ్డీతో సహా రికవరీ చేయాలని ఆయన కోరారు. చీటింగ్, క్రిమినల్ కేసుల నమోదు కోసం బుగ్గారం పోలీస్ స్టేషన్ లో కూడా పిర్యాదు చేయడం జరిగిందని ఆయన వివరించారు. త్వరలో మరిన్ని నిఘా సంస్థలకు, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అయిన హై కోర్ట్ లో కూడా పిర్యాదులు చేయనున్నట్లు చుక్క గంగారెడ్డి తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్