Wednesday, December 4, 2024

గఘన యాన్ సక్సెస్

- Advertisement -

శ్రీహరికోట, అక్టోబరు 21, (వాయిస్ టుడే ):  ఇస్రో చేపట్టిన గగన్‌యాన్ మిషన్ విజయవంతంగా పూర్తైంది. సాంకేతిక సమస్యల కారణంగా కాసేపు టెన్షన్ పెట్టినా గగన్ యాన్ టీవీ డీ1 ప్రయోగం సూపర్ సక్సెస్ అయ్యింది. రెండు వాయిదాల తర్వాత మూడోసారి రాకెట్ ను ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఫలించింది. ప్రయోగం తర్వాత నింగిలో 17 కిలోమీటర్ల ఎత్తులో రాకెట్ నుంచి క్రూ ఎస్కేప్‌ మాడ్యూల్‌, క్రూ మాడ్యూల్‌ పరస్పరం విడిపోగా సెకనుకు 8.5 మీటర్ల వేగంతో క్రూ మాడ్యూల్‌.. సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది. ఈ ప్రయోగంలో విజయం సాధించటం ద్వారా భవిష్యత్తులో రాకెట్ లో సమస్యలు తలెత్తినా అందులో ఆస్ట్రోనాట్లకు రక్షణ కల్పించేలా ప్రణాళికలు రచిస్తామని ఇస్రో తెలిపింది. ఇస్రో గగన్ యాన్ ప్రాజెక్ట్ లో ఇది మొదటి విజయమని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు

Gagana is a success
Gagana is a success

“ఇస్రో చేపట్టిన  TV-D1 మిషన్‌ విజయవంతంగా పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉంది. గగన్‌యాన్‌ మిషన్‌లో కీలకమైన క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ని పరీక్షించేందుకు ఈ ప్రయోగం చేపట్టాం. ధ్వని వేగంగా కన్నా కాస్త ఎక్కువ వేగంతోనే వెహికిల్ దూసుకెళ్లింది. ఆ వేగం చేరుకున్న తరవాత క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ యాక్టివేట్ అయింది. క్రూ మాడ్యూల్ విజయవంతంగా విడిపోయింది. మేం అనుకున్నట్టుగానే సముద్రంలోకి దిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి డేటా మా వద్ద ఉందిఈ ప్రయోగం సక్సెస్ అయ్యే ముందు కాసేపు టెన్షన్ పెట్టింది. టెక్నికల్ ఫెయిల్యూర్ కారణంగా ప్రయోగం రెండు గంటలు ఆలస్యమైంది. అయితే…ఇందుకు కారణమేంటో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వివరించారు. లిఫ్ట్ ఆఫ్ అయ్యే ముందు చిన్న సమస్య ఎదురైందని, అందుకే…ప్రయోగంలో జాప్యం జరిగిందని చెప్పారు.  “ప్రయోగం మొదలయ్యే ముందు లిఫ్ట్‌ ఆఫ్‌ హోల్ట్‌లో పెట్టాల్సి వచ్చింది. గ్రౌండ్ కంప్యూటర్‌ లిఫ్ట్‌ఆఫ్‌కి క్లియరెన్స్ ఇవ్వలేదు. ఈ టెక్నికల్ ఇష్యూని వెంటనే గుర్తించాం. తక్షణమే ఆ సమస్యని సవరించాం. కాకపోతే…అంతా క్లియర్ అవడానికి రెండు గంటల సమయం పట్టింది”

–  సోమనాథ్, ఇస్రో ఛైర్మన్

రెండు  గంటల ఆలస్యంగా గగన్‌యాన్ మిషన్ ప్రయోగం విజయవంతంగా పూర్తైంది. సాంకేతిక లోపాన్ని సరి చేసిన శాస్త్రవేత్తలు పది గంటలకు ప్రయోగం చేపట్టారు. ఆలస్యమైనప్పటికీ విజయవంతంగా సింగిల్‌ స్టేజ్‌ లిక్విడ్‌ రాకెట్‌ను ప్రయోగించారు.

Gagana is a success
Gagana is a success

ముగ్గురు అస్ట్రోనట్స్ పంపింపచడానికి లైన్ క్లియర్

ఇస్రో గగన్‌యాన్ మిషన్‌ విజయవంతంగా పూర్తైంది. ఆస్ట్రోనాట్‌లను స్పేస్‌లోకి పంపించడంలో కీలకమైన  ని టెస్ట్ చేసేందుకు ఈ ప్రయోగం చేపట్టిన ఇస్రో…సక్సెస్ అయింది. క్రూ ఎస్కేప్ సిస్టమ్ పైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. ఆస్ట్రోనాట్‌లను సురక్షితంగా ల్యాండ్‌ చేసే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇది. క్రూ మాడ్యూల్‌  గాల్లో ఉన్నప్పుడు క్రూ ఎస్కేప్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఆ సమయంలో ఫ్లైట్‌ కండీషన్‌ ఏంటో తెలుసుకునేందుకు ఇస్రోకి వీలవుతుంది. క్రూ మాడ్యూల్ నుంచి క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ విజయవంతంగా విడిపోతుందా లేదా అన్నది పరీక్షిస్తారు. ప్రస్తుతం చేసింది కూడా అదే. భవిష్యత్‌లోనూ మరిన్ని టెస్ట్‌లు చేసేందుకు ప్లాన్ చేసుకుంది ఇస్రో. Mach Number 1.2 వద్ద TV-D1 మిషన్‌ అబార్ట్ అయ్యేలా సెట్ చేసింది. గగన్‌మిషన్‌తో ద్వారా ఇస్రో ముగ్గురు వ్యోమగాముల్ని స్పేస్‌లోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. 400 కిలోమీటర్ల ఎత్తులోని ఆర్బిట్‌లోకి ఈ ముగ్గురినీ పంపాలనుకుంటోంది. మూడు రోజుల పాటు ఈ మిషన్ కొనసాగుతుంది. ఆ తరవాత వాళ్లను సురక్షితంగా భూమి మీదకి తీసుకురావడంతో ఈ మిషన్ పూర్తవుతుంది. బెంగళూరులోని లో ఈ ఆస్ట్రోనాట్స్‌కి శిక్షణ అందించనున్నారు. క్లాస్‌రూమ్ ట్రైనింగ్, ఫిజికల్ ఫిట్‌నెస్ ట్రైనింగ్, సిమ్యులేటర్ ట్రైనింగ్, ఫ్లైట్‌ సూట్‌ ట్రైనింగ్‌ ఇస్తారు. దశల వారీగా ఈ మిషన్‌ని ప్రయోగించనుంది ఇస్రో. ఇప్పటికే తొలి దశ విజయవంతంగా పూర్తైంది. ఈ మిషన్‌ కోసం 90 బిలియన్‌ల ఖర్చు చేయనుంది ఇస్రో. ఇప్పటికే సోవియట్ యూనియన్, అమెరికా, చైనా స్పేస్‌లో వ్యోమగాముల్ని పంపాయి. గగన్‌యాన్ మిషన్‌ సక్సెస్‌ అయితే…ఈ జాబితాలో భారత్‌ కూడా చేరనుంది. తొలి దశ పూర్తైంది కాబట్టి ఇకపై పూర్తి స్థాయిలో దీన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది ఇస్రో. వచ్చే ఏడాది ఓ హ్యూమనాయిడ్ రోబోని గగన్‌యాన్ స్పేస్‌ క్రాఫ్ట్‌  ద్వారా పంపేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఫిమేల్‌ రోబోకి  అనే పేరు కూడా పెట్టింది. 2019లోనే ఈ ఫిమేల్ హ్యూమనాయిడ్‌ని  ప్రపంచానికి పరిచయం చేసింది. తొలిసారి 1984లో భారతీయుడైన రాకేశ్ శర్మ రష్యన్ స్పేస్‌ క్రాఫ్ట్‌లో అంతరిక్షంలోకి వెళ్లాడు. అక్కడ దాదాపు 21 రోజుల 40 నిముషాల పాటు ఉన్నాడు. ఇప్పటికే చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్‌తో ప్రపంచవ్యాప్తంగా ఇస్రో పేరు మారుమోగుతోంది. అంతరిక్ష రంగంలో మిగతా దేశాలకు ఏమీ తీసిపోమన్న సందేశాన్ని ఇస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా స్పేస్‌ ఇండస్ట్రీకి ప్రోత్సాహం అందిస్తోంది. ఫలితంగా..వరుస పెట్టి కీలకమైన ప్రయోగాలను చేపడుతోంది. అందులో భాగంగానే గగన్‌యాన్‌కి శ్రీకారం చుట్టింది. 2025 నాటికి పూర్తి స్థాయిలో ఓ ఆస్ట్రోనాట్‌ని స్పేస్‌లోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Gagana is a success
Gagana is a success

మోడీ ప్రశంసలు

ఈ రోజు ఉదయం (అక్టోబర్ 21) 8.45 గంటలకు ప్రయోగానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే…ఇంజిన్‌లో గ్లిచ్ కారణంగా రెండు గంటలు ఆలస్యంగా లాంఛ్ చేశారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 10 గంటలకు గగన్‌యాన్‌ మిషన్‌ లాంఛ్ అయింది.  TV D1 Test Flight విజయవంతంగా పూర్తైందని ఇస్రో ప్రకటించింది. అనుకున్న విధంగానే క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ పని చేసింది. ప్రయోగం తర్వాత నింగిలో 17 కిలోమీటర్ల ఎత్తులో రాకెట్ నుంచి క్రూ ఎస్కేప్‌ మాడ్యూల్‌, క్రూ మాడ్యూల్‌ పరస్పరం విడిపోగా సెకనుకు 8.5 మీటర్ల వేగంతో క్రూ మాడ్యూల్‌.. సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది. ఈ ప్రయోగంలో విజయం సాధించటం ద్వారా భవిష్యత్తులో రాకెట్ లో సమస్యలు తలెత్తినా అందులో ఆస్ట్రోనాట్లకు రక్షణ కల్పించేలా ప్రణాళికలు రచిస్తామని ఇస్రో తెలిపింది. అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇస్రో. ఇందులో భాగంగానే గగన్‌యాన్ మిషన్ చేపట్టింది. 2025 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని చూస్తోంది.”గగన్‌యాన్‌ మిషన్ సక్సెస్‌తో తొలి హ్యూమ్ స్పేస్‌ ఫ్లైట్ ప్రోగ్రామ్‌లో భారత్‌ ఓ అడుగు ముందుకు వేసినట్టైంది. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు”

– ప్రధాని నరేంద్ర మోదీ 

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్