గంగపుత్ర కులాన్ని కుటుంబ సర్వే రిపోర్టులో చేర్చాలి – బి.సి కమిషన్ ఛైర్మెన్‌కు వినతి

- Advertisement -

గంగపుత్ర కులాన్ని కుటుంబ సర్వే రిపోర్టులో చేర్చాలి – బి.సి కమిషన్ ఛైర్మెన్‌కు వినతి

Gangaputra Caste Must Be Included in Family Survey Report – Representation to BC Commission Chairman

హైదరాబాద్‌లోని తెలంగాణ బి.సి కమిషన్ కార్యాలయంలో తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా బి.సి కమిషన్ ఛైర్మెన్ నిరంజన్ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.

ఇటీవల ప్రకటించిన సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అగ్నికుల క్షత్రియ కులాన్ని తొలగించి, తెలంగాణలో సనాతన సంప్రదాయ మత్స్యకార కులస్తులైన బెస్త, గుండ్లతో కలిపి గంగపుత్రులను ప్రధాన కులంగా గుర్తించి రిపోర్టులో చేర్చాలని వారు విజ్ఞప్తి చేశారు. గంగపుత్రులను ప్రత్యేకంగా గుర్తించడం ద్వారా వారికి సరైన ప్రాతినిధ్యం, న్యాయం జరుగుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా బి.సి కమిషన్ సభ్యుడు జయప్రకాశ్తో పాటు ఇతరులు కూడా పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular