**బీసీ కులగణన కోసం వి.హెచ్.నిరాహార దీక్షకు గంగపుత్ర సంఘం సంపూర్ణ మద్దతు**

- Advertisement -

**బీసీ కులగణన కోసం వి.హెచ్.నిరాహార దీక్షకు గంగపుత్ర సంఘం సంపూర్ణ మద్దతు**

Gangaputra Sangham Extends Full Support to V.H.’s Hunger Strike for BC Caste Census

హైదరాబాద్: బీసీ కులగణనను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వి.హనుమంతరావు చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షకు తెలంగాణ గంగపుత్ర సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

రామంతాపూర్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దీటి మల్లయ్య గంగపుత్రను, రాష్ట్ర కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర మర్యాదపూర్వకంగా కలిసి వరంగల్ గంగపుత్ర హౌసింగ్ సొసైటీ డైరీను అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం వెంటనే బీసీ కులగణనను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. బీసీలకు న్యాయం జరగాలంటే కులగణన కీలకమని పేర్కొన్నారు.

అలాగే, తెలంగాణ పర్యటనకు రానున్న నరేంద్ర మోడీ బీసీ కులగణనపై స్పష్టమైన ప్రకటన చేసి రాష్ట్రంలో అడుగుపెట్టాలని, లేకుంటే తెలంగాణ కుల సంఘాలతో కలిసి నిరసనలు చేపట్టి అడ్డుకుంటామని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం నాయకులు, సభ్యులు ఉన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular