రంగారెడ్డి(Ranga Reddy):
మైలార్ దేవ్ పల్లి(Mailardevpally)లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. ఓ హెయిర్ సెలూన్ పై దాడి.సెలూన్ లో ఉన్న ఫర్నీచర్ ధ్వంసం చేసారు. యజమాని పై విచక్షణారహితంగా పిడుగుద్దుల వర్షం కురిపించారు. ముగ్గురు గంజాయి గ్యాంగ్ గాళ్లు సెలూన్ కు వచ్చి హెయిర్ కట్టింగ్ చేయించుకున్నారు. డబ్బులు అడిన పాపానికి యజమాని పై దాడిచేసారు. మా దగ్గర డబ్బులు అడుగుతావా అంటూ రెచ్చిపోయి హంగామా చేసారు గంజాయి మత్తులో నానా హంగామా చేసారు. అడ్డు వచ్చిన స్థానికుల పై దాడి కి దిగా,రు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చే లోపు అక్కడి నుండి పరారైయారు. గంజాయి గ్యాంగ్ తో ఏగలేక పోతున్నామంటున్న స్థానికులు, గంజాయి మత్తులో కాలనీ వాసులపై దాడి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
మైలార్ దేవ్ పల్లి లో రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్
- Advertisement -
- Advertisement -