ప్రతి ఇంటి వద్ద చెత్త సేకరణ విధిగా నిర్వహించాలి..
Garbage collection should be done at every house...కమిషనర్ ఎన్.మౌర్య
తిరుపతి
తిరుపతి నగరంలో ప్రతి ఇంటి వద్ద, వ్యాపార సముదాయాల వద్ద నుండి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరణ చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, వాహనాల జి.పి.ఎస్. ట్యాగింగ్, వాహనాల రూట్ మ్యాప్ తదితర అంశాలపై హెల్త్, ఇంజినీరింగ్ అధికారులతో శుక్రవారం సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ఇంటింటి వద్ద నుండి, వ్యాపార సముదాయాలు, అపార్ట్మెంట్లు నుండి తడి, పొడి చెత్త సేకరణ విధిగా చేపట్టాలని అన్నారు. వాహనాలు ఏ ఏ మార్గాల్లో ఎన్ని గంటలకు వెళుతున్నాయి, వాహనంతో పాటు ఎంతమంది వెళుతున్నారు అని విషయాలు నమోదు చేయాలని అన్నారు. వంద శాతం ముఖ ఆధారిత హాజరు నమోదు చేపట్టాలని అన్నారు. ప్రతి వాహనానికి జి.పి.ఎస్. ఏర్పాటు ఎక్కడ తిరుగుతున్నాయి అనే విషయాలు రికార్డు చేయాలని అన్నారు. తెల్లవారు జామునే నగరంలోని చెత్త కుప్పలు తొలగించి, పారిశుద్ధ్య పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. మురుగు నీటి కాలువల్లో చెత్త తొలగింపు నిత్యం జరిగేలా చూడాలని అన్నారు. బల్క్ వేస్ట్ జనరేటర్స్ ను గుర్తించి వారే చెత్త నిర్వహణ చేసేలా చర్యలు చేపట్టాలని అన్నారు. వార్డులకు ప్రత్యేకంగా నియమించిన అధికారులు పర్యవేక్షించి మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, డి.ఈ.లు మహేష్, రమణ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డి.సి.పి. మాహాపాత్ర, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు రెడ్డి, శానిటరీ సూపర్ వైజర్లు చెంచయ్య, సుమతీ, శానిటరీ ఇన్స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.




