Wednesday, January 21, 2026

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన జర్మన్ పారిశ్రామిక వేత్త స్టీఫెన్

- Advertisement -

మంత్రి పొన్నం..పీసీసీ చీఫ్ మహేష్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన

జర్మన్ పారిశ్రామిక వేత్త స్టీఫెన్

German industrialist Stephen meets Chief Minister Revanth Reddy

హైదరాబాద్

తాటి ఈత చెట్ల నుండి వచ్చే కల్లుతో వైన్ ఆరక్ తదితర అనుబంధ పదార్థాలు తయారు చేసే పరిశ్రమను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి తగిన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ జర్మన్ ప్రతినిధి స్టీఫెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క లను కలిసారు.
గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఫ్రొఫెసర్ జానయ్య కాంబోడియా స్టడీ టూర్ వెళ్ళినపుడు అక్కడ ఈ పరిశ్రమ ఎంతో ఆర్థికంగా ఉపాధి కల్పిస్తుండడంతో తెలంగాణ లో కూడా పరిశ్రమ ఏర్పాటు కు స్టీఫెన్ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వీరి విజ్ఞప్తి మేరకు తెలంగాణ లో కల్లు ఆధారిత పరిశ్రమల్లో భాగంగా తాటి ఈత చెట్ల నుండి వైన్, ఆరక్ తయారు చేసే పరిశ్రమ ఏర్పాటు చేస్తామని జర్మన్ ప్రతినిధి స్టీఫెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి తెలియజేశారు.
అసెంబ్లీ ప్రాంగణములో మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లతో కలిసి ముఖ్యమంత్రిని కలిసిన స్టీఫెన్ ఈ పరిశ్రమ తెలంగాణాలో ఏర్పాటు చేయడం వల్ల గీత కార్మికులు వృత్తి పరమైన ఆర్థికాభివృద్ధిని పొందడమే కాకుండా, వాల్యూ అడిషన్, ఉపాధి అవకాశాలు  మెరుగు పడతాయని అయన వివరించారు. తెలంగాణ కల్లు యూరప్ కి ఎగుమతి స్థానికంగా కల్లు దుకాణాల ఏర్పాటు. గీత కార్మికులకు కనీసం ఆదాయం పెంపుదల ఇతర రాష్ట్రాలు మరియు ఇతర దేశాలకు మార్కెటింగ్ విస్తరణ తో పాటు రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ విభాగం ఏర్పాటు చేయడం, తాటి ఈత మొక్కలు త్వరగా పెరిగి అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాల తయారుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు.
సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జర్మన్ ప్రతినిధి స్టీఫెన్, పారిశ్రామిక వేత్త రోహిత్ పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్